సోమవారం 01 మార్చి 2021
Yadadri - Feb 20, 2021 , 00:53:28

గడప గడపకూ వెళ్లాలి

గడప గడపకూ వెళ్లాలి

  • ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివరించాలి
  • ప్రతి ఒక్కరినీ పార్టీలోకి ఆహ్వానించాలి 
  • టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు పండుగలా సాగాలి
  • తుంగతుర్తి నియోజకవర్గంలో 63వేల సభ్యత్వాన్ని అధిగమించాలి
  • మోత్కూరు సభ్యత్వ నమోదులో పాల్గొన్న 
  • ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌

మోత్కూరు, ఫిబ్రవరి 19 : ఊరు వాడా, ప్రతి గడపకూ వెళ్లి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి అన్ని వర్గాల వారిని ఆహ్వానించి పార్టీ సభ్యత్వం అందించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ కోరారు. శుక్రవారం మోత్కూరు మండల కేంద్రంలోని చెరువుకట్ట వద్ద టీఆర్‌ఎస్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ నమోదులో పాల్గొని మాట్లాడారు. ఉద్యమం చేసి రాష్ర్టాన్ని సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీయే శ్రీరామ రక్ష అని, గులాబీ దళంలో చేరి పని చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతి కార్యకర్త కలిసికట్టుగా గ్రామాలు, పట్టణాలు, వార్డుల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ సభ్యత్వ నమోదును పండుగలా నిర్వహించాలన్నారు. గత రెండేండ్ల కాలంలో నియోజకవర్గంలో 63వేల సభ్యత్వం కలిగి ఉన్నామని, ఇప్పుడు దానికి మించి సభ్యత్వం చేయడానికి లక్ష్యంగా పని చేయాలని సూచించారు. సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా రూ.2లక్షల చొప్పున వర్తిస్తుందని తెలిపారు. పార్టీ అప్పగించిన ఈ కార్యక్రమాన్ని వారంలోగా పూర్తి చేసేందుకు మండల, మున్సిపాలిటీల వారీగా ఇన్‌చార్జిలను నియమించి బాధ్యతలు అప్పగించామన్నారు. కష్టపడి పని చేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని, సభ్యత్వాలతో టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేసి తెలంగాణలో పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టాలన్నది అధినేత కేసీఆర్‌ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్‌రెడ్డి, మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్‌, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ కొణతం యాకుబ్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్లు కొండ సోంమల్లు, తీపిరెడ్డి మేఘారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బొల్లేపల్లి వెంకటయ్య, కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, బొడ్డుపల్లి కల్యాణ్‌చక్రవర్తి, మండల ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేశ్‌, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులు నర్సింహ, ఆనందమ్మ, నబీ సాహినీసుల్తానా, మాజీ ఎంపీటీసీ జంగ శ్రీను తదితరులు 

పాల్గొన్నారు.

VIDEOS

logo