శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 19, 2021 , 03:23:42

ఉద్యమంలా సభ్యత్వ నమోదు

ఉద్యమంలా సభ్యత్వ నమోదు

  • సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి వెంకటేశ్వర్లు

యాదాద్రి, ఫిబ్రవరి 18 : టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు  ప్రక్రియ ఉద్యమంలా కొనసాగుతున్నది. టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఇంటింటికీ తిరుగుతూ ప్రధాన కూడళ్లలో క్యాంపు నిర్వహించి సభ్వత్వాలు అందజేశారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని సభ్యత్వ క్యాంపు వద్ద చేపట్టిన నమోదు ప్రక్రియను సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి వై.వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన గడువులోపు టార్గెట్‌ పూర్తి చేసే విధంగా నమోదు ప్రక్రియలో వేగం పెంచాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, కౌన్సిలర్లు తాళ్లపల్లి నాగరాజు, కోఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌బాబా, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్‌ మిట్ట వెంకటయ్య, మహేంద్ర యువసేన పట్టణ అధ్యక్షుడు బండ్లపల్లి నరేశ్‌గౌడ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.తుర్కపల్లిలో... 

సభ్యత్వ నమోదును ఉద్యమంలా చేపట్టి పూర్తి చేయాలని జిల్లా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి వై.వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన గురువారం మండలంలో చేపడుతున్న సభ్యత్వాల నమోదును పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో స్థానికులకు సభ్యత్వం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలానికి ఇచ్చిన సభ్యత్వాల నమోదు టార్గెట్‌ను త్వరితగతిన పూర్తి చేసి ఇతర మండలాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పడాల శ్రీనివాస్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ బీకూనాయక్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ కొమిరిశెట్టి నర్సింహులు, మండల ఇన్‌చార్జి కె.శ్రీనివాస్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బద్దునాయక్‌, కోఆప్షన్‌ ఫోరం జిల్లా అధ్యక్షుడు రహమత్‌ షరీఫ్‌, సోషల్‌ మీడియా నియోజకవర్గ కన్వీనర్‌ నల్ల శ్రీకాంత్‌, మాజీ ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ యూత్‌ మండలాధ్యక్షుడు శంకర్‌నాయక్‌, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి కోట విజయ్‌, మల్లప్ప, భాస్కర్‌నాయక్‌, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు(ఎం)లో... 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని, అందుకే ప్రతిఒక్కరూ టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకొని గర్వపడుతున్నారని సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి వై.వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్‌ రైతుబంధు, రైతుబీమా, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్‌, మిషన్‌భగీరథ, మిషన్‌ కాకతీయ,  కల్యాణలక్ష్మి తదితర పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. జిల్లాలో 80వేల సభ్యత్వాలను పూర్తి చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఆత్మకూరు(ఎం) మండలంలో 10వేల సభ్యత్వాలను ఈనెల 20వ తేదీ వరకు పూర్తి చేసి అందించాలని గ్రామ ఇన్‌చార్జిలకు సూచించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ పి.పూర్ణచందర్‌రాజు, మాజీ సర్పంచ్‌ బీసు చందర్‌గౌడ్‌లకు టీఆర్‌ఎస్‌ సభ్యత్వాలను అందజేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు భాషబోయిన ఉప్పలయ్య, యాస రంగారెడ్డి, జిల్లా నాయకులు భిక్షపతి, భానుప్రకాశ్‌, ఇంద్రారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు వెంకన్న, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు అరుణ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo