ప్రశ్నించే గొంతును కాదు..పరిష్కరించే వ్యక్తిని గెలిపించాలి

- ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
చౌటుప్పల్ రూరల్, ఫిబ్రవరి 18 : పట్టభద్రుల ఎన్నికల్లో ప్రశ్నించే గొంతును కాదు.. సమస్యలు పరిష్కరించే వ్యక్తిని గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. గురువారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ ఇంట్లో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు కూడా ఓటర్ల నమోదులో క్రియా శీలకంగా పని చేస్తూ అన్ని వర్గాల ఓటర్లు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మద్దతు ఇస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ వేల కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. సాగర్ ఎమ్మెల్యే ఉపఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. ఈ సమావేశంలో సికిలంమెట్ల శ్రీహరి, నాయకులు బొంగు జంగయ్యగౌడ్, సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించండి.. బీసీసీఐని కోరిన కేటీఆర్
- ఆ నినాదాలు వింటే చైనాకు ఒళ్లుమంట: ప్రధాని
- రామన్ ఎఫెక్ట్‌కు 93 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
- ఫుడ్ కార్పొరేషన్లో ఏజీఎం పోస్టులు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్‌పై ఆంక్షలు!
- ఆ గవర్నర్ నన్ను కూడా లైంగికంగా వేధించారు!
- హైదరాబాద్‌లో నడిరోడ్డుపై నాగుపాము కలకలం..!