శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Feb 19, 2021 , 03:23:33

లక్కీ డ్రాప్‌ దక్కింది

లక్కీ డ్రాప్‌ దక్కింది

  • జిల్లా ఐదు బార్లకు 700 దరఖాస్తులు
  • లాటరీ పద్ధతిలో బార్ల కేటాయింపు
  • భువనగిరిలో లక్కీడ్రా తీసిన కలెక్టర్‌
  • సమాన న్యాయం కోసమే..
  • కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

 భువనగిరి అర్బన్‌, ఫిబ్రవరి 18: దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం జరగాలని లాటరీ పద్ధతిలో బార్ల ఎంపిక చేశామ ని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు కానున్న 5 బార్లకు గురువారం పట్టణంలోని రావిభద్రారెడ్డి గార్డెన్‌లో లాటరీ పద్ధతిలో కలెక్టర్‌ చేతుల మీదుగా ఎంపిక చేశారు. జిల్లాలో నూతన బార్లను జనాభా ప్రకారం కేటాయించామని, ఎక్సై జ్‌ శాఖ నియమాల మేరకు నిబంధనలు పాటిస్తూ నడుపుకోవాల న్నారు. కేటాయించిన బార్లతో ప్రజలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు కానున్న 5 బార్లకు మొత్తం 700 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో చౌటుప్పల్‌లో 2 బార్లకు 145 దరఖాస్తులు రాగా లాటరీలో మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్‌ మం డలం మేడిపల్లికి చెందిన సునీల్‌కుమార్‌ దరఖాస్తు నం.112, రామ న్నపేట మండల కేంద్రానికి చెందిన నన్నూరి నర్సిరెడ్డి దరఖాస్తు నం.106, ఆలేరులో ఒక బారుకు 133 దరఖాస్తులు రాగా జనగాం జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన బత్తిని శ్రీధర్‌ నం.81, యాదగిరి గుట్టలో ఒక బారుకు 317 దరఖాస్తులు రాగా యాదగిరిగుట్ట మండ లం గుండ్లపల్లికి చెందిన లచ్చారపు వెంకటేశ్‌ నం.261, మోత్కూరు లో ఒక బారుకు 150 దరఖాస్తులు రాగా ఆత్మకూర్‌ (ఎం)మండ లంలోని కూరెళ్ల గ్రామానికి చెందిన కొట్టూరి నవీన్‌కుమార్‌ నం. 27 నంబర్ల లాటరీ ద్వారా ఎంపిక చేశారు.  కార్యక్రమంలో ఎక్సైజ్‌శాఖ జిల్లా అధికారి ఎస్‌.కృష్ణప్రియ, ఎక్సైజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

VIDEOS

logo