శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 19, 2021 , 03:23:32

అన్నివర్గాల సంక్షెమాని కృషి

అన్నివర్గాల సంక్షెమాని కృషి

  • ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 

రామన్నపేట, ఫిబ్రవరి 18: అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నదని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం మండలంలోని శోభనాద్రిపురం, సిరిపురం, ఇంద్రపాలనగరం గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ ఆసరా పింఛ న్లు, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు అందించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాలని సూచించారు. శోభనాద్రిపురం గ్రామాన్ని రూ. 20లక్షలతో దశలవారీగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇంద్రపాలనగరంలో రూ.15 లక్షలతో వడ్డెర సంఘం భవన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లక్ష్మీజగన్‌మోహన్‌, సర్పంచ్‌లు సిద్ధమ్మయాదయ్య, లక్ష్మీనర్సు, మండల అధ్యక్ష, కార్యదర్శులు భిక్షంరెడ్డి, శ్రీనివాస్‌, కృష్ణారెడ్డి, రాములు, ఉదయ్‌రెడ్డి, చంద్రకళాశ్రీనివాస్‌, నరేందర్‌, నర్సింహ, శంకరయ్య, శ్రీధర్‌రెడ్డి,  వివిధ గ్రామాల సర్పంచ్‌లు , ఎంపీటీసీలు పాల్గొన్నారు. అదేవిధంగా మం డలంలోని లక్ష్మాపురం గ్రామశాఖ సభ్యత్వ నమోదు పూర్తి చేయడంలో ముందుంది. గ్రామానికి నిర్ణయించిన లక్ష్యాన్ని కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే పూర్తి చేశారు. పూర్తి చేసిన సభ్యత్వాలను ఎమ్మెల్యే లింగయ్యకు గురువారం అం దజేశారు. సభ్యత్వాలను పూర్తి చేయించిన ఇన్‌చార్జి మందడి ఉదయ్‌రెడ్డిని, సర్పంచ్‌ ప్రకాశ్‌, గ్రామశాఖ అధ్యక్షుడు లింగయ్య,  మాజీసర్పంచ్‌లను ఎమ్మెల్యే అభినందించారు.   

అనూహ్య స్పందన..

భూదాన్‌పోచంపల్లి, ఫిబ్రవరి 18 : పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అనూ హ్య స్పందన లభిస్తున్నదని చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీ శ్రీనివాస్‌ అన్నారు. గురువారం ఆమె 13వ వార్డులో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించా రు. కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ పుష్పలతామల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశం, సింగిల్‌విండో చైర్మన్‌ భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం డివిజన్‌ అధ్యక్షుడు కిరణ్‌, మహేశ్‌, శ్రవణ్‌, సుమన్‌, లక్ష్మీకాంత్‌, నర్సింహ, శేఖర్‌ పాల్గొన్నారు. 

ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేర్చాలి

భువనగిరి అర్బన్‌, ఫిబ్రవరి 18: ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందేలా చూడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జడల అమరేందర్‌గౌడ్‌ అన్నారు. గురువారం పట్టణంలోని 18వ వార్డులో అమరేందర్‌గౌడ్‌, 17వ వార్డులో స్వాతీమహేశ్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ క్రియాశీల సభ్యత్వాలను నాయకులు, కార్యకర్తలకు  వేర్వేరుగా అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు, వైస్‌ చైర్మన్‌ కిష్టయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు   సుధాకర్‌రెడ్డి, 18వ వార్డు కౌన్సిలర్‌ శంకర్‌, రాజేందర్‌రెడ్డి, రమేశ్‌, మోహన్‌రెడ్డి,  శ్రీనివాస్‌, రవి, శ్రవణ్‌, దయాకర్‌, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. 

అడ్డగూడూరులో..

అడ్డగూడూరు, ఫిబ్రవరి18: టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో జోరుగా సాగుతున్నది. కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతీఅయోధ్య, మార్కెట్‌ కమిటీ మాజీ  చైర్మన్‌ మహేంద్రనాథ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పూలపల్లి జనార్దన్‌రెడ్డి,  శ్రీరాముల అయో ధ్య, విష్ణువర్దన్‌,  నరేశ్‌, మండల లతీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

అర్హులకు ప్రభుత్వ పథకాలు

భువనగిరి, ఫిబ్రవరి 18: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నదని రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ కంచి మల్లయ్య అన్నారు. గురువారం మండలంలోని కేసారం గ్రామంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పార్టీ సభ్యత్వాలను ఆయన అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కృష్ణమూర్తి, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు నరేశ్‌, నాయకులు నరేశ్‌, నర్సింహ, సాయి, సుర్వి సంపత్‌, మల్లేశ్‌, అయిలయ్య, యాదగిరి ఉన్నారు. 

పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి

వలిగొండ, ఫిబ్రవరి 18: పార్టీ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్‌ ముద్దసాని కిరణ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలోని వెంకటాపురం, చిత్తాపురం, వేములకొండ గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. పహిల్వాన్‌పూర్‌ గ్రామం లో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సభ్యత్వ నమో దు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు అంజిరెడ్డి, వెంకట్‌రెడ్డి, నర్సింహ, లక్ష్మమ్మ బాలయ్య, గోపాల్‌,  మహేశ్‌, వెంకన్న, మత్స్యగిరి పాల్గొన్నారు.

పడమటిసోమారంలో సభ్యత్వ నమోదు

బీబీనగర్‌, ఫిబ్రవరి 18 : పడమటిసోమారం గ్రామ శాఖ ఆధ్వర్యంలో గురువారం టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌   సర్పంచ్‌ గణేశ్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఉపసర్పం చ్‌ చంద్రకళ, ఆలయ చైర్మన్‌ బస్వరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు  బలవంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo