కార్యకర్తలే పార్టీకి నిజమైన బలం

- పిడికెడు మందితో ప్రారంభమై చరిత్ర తిరగరాస్తున్న టీఆర్ఎస్
- గడపగడపకూ సంక్షేమ పథకాలు
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి
యాదాద్రి, ఫిబ్రవరి16: నాటి ఉద్యమ నేత, నేటి సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ పిడికెడు మందితో ప్రారంభమై నేడు చరిత్రను తిరగరాస్తు న్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని గొంగిడి నివా సంలో టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ దినే శ్ చౌదరి ఆధ్వర్యంలో సోషల్ మీడియా ప్రచారంపై అవగా హన కల్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 256 పథకాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలో, ప్రభు త్వం పై ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలో తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నిబద్ధత ఉన్న కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నా రు. రెండేండ్ల కిందట రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల సభ్యత్వా లను నమోదు చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోనే అ త్యంత బలమైన పార్టీగా ఆవిర్భవించిందన్నారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్త ప్రమాదవశాత్తూ మృతి చెందితే బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల బీమా చెక్కును అందజేసి బాస టగా నిలుస్తున్నదన్నారు. ప్రతీ కార్యకర్త ఇంటింటికీ తిరుగు తూ గ్రామాల్లో నిర్మిస్తున్న వై కుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, చెత్త సేకరణ ట్రాక్టర్లను ప్రభు త్వం అందజేస్తున్నదని ప్రజలను చైతన్య పర్చాలని అన్నా రు. ప్రతిపక్ష నేతల విమర్శలకు సామాజిక మాధ్యమాల్లో గట్టిగా బదులిస్తున్న టీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ శ్రీకాంత్, నాయకులు అజ్జు, ప్రసాద్, హరీశ్, బాల్సింగ్, భాస్కర్, విజయ్, మ ల్లారెడ్డి, అనీల్, రాజేశ్, మహేశ్, గోపి, బాలు, మోహన్, జహంగీర్, రాజు పాల్గొన్నారు.
ఆలేరు టౌన్,ఫిబ్రవరి 16 : ఆలేరు పట్టణంలో మంగళవా రం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మాజీ జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్‌కు పార్టీ సభ్యత్వాన్ని అందజేశా రు. అలాగే పీఏసీఎస్ వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళకు కౌన్సిలర్ బేతి రాములు సభ్యత్వం అందజేశారు. కార్యక్ర మంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకు లు మల్లేశం, భానుచందర్, డా.మురహరి పాల్గొన్నారు.
అదేవిధంగా ఆలేరు పట్టణంలో మొదటి వార్డు అధ్యక్షుడు సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు నిర్వహిం చారు. పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్, బాలస్వామి, బ్యూలా రాణి, రియాజ్, మల్లేశ్, శ్రీధర్, సుజాత, గోరెమియా, సిద్ధి రాజు, మహ్మద్, శ్రీకాంత్, మోహన్, బాలరాజు, పాప య్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు
ఆలేరురూరల్: మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వ నమోదు చేపట్టా రు. కార్యక్రమంలో శోభన్‌బాబు, బాలరాజ్, నరేందర్, మహేందర్, సంతోశ్, మల్లేశ్, నరేశ్ పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్: మండలంలోని మల్లాపురంలో ఉప సర్పంచ్ల ఫో రం మండల అధ్యక్షుడు రేపాక స్వా మి, రామాజీపేటలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం మండలాధ్య క్షుడు ప్రసాద్ గౌడ్ సభ్యత్వాలు అందజేశారు. స్వామి, భిక్షపతి, బాలయ్య, వెంకటేశ్ పాల్గొన్నారు.
ముమ్మరంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
మోటకొండూర్: మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో జ డ్పీటీసీ వెంకట్ రెడ్డి, మండల ఇన్చార్జి బాలయ్య పలువురి కి సభ్యత్వాలు అందజేశారు. మండల కేంద్రంలో వంగపల్లి పీఏసీఎస్ వైస్ బాలయ్య, మాజీ ఉపసర్పంచ్ నర్సింహ, వర్టూర్లో పార్టీ సెక్రటరీ జనరల్ నర్సింగ్ యాదవ్, కో ఆప్ష న్ సభ్యుడు బురాన్, రైతుబంధు సమితి కన్వీనర్ ఐలయ్య, ఇక్కుర్తి లో ఉపసర్పంచ్ మొగులయ్య సభ్యత్వాలు చేశారు. కార్యక్ర మాల్లో ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ జంగారెడ్డి, అనంత రెడ్డి, భాస్కర్, మెహన్గౌడ్ పాల్గొన్నారు.
రాజాపేట: మండలంలోని కొత్తజాలలో మంగళవారం పార్టీ సభ్యత్వ నమోదులో సర్పంచ్ ఠాకూర్ ధర్మేందర్సిం గ్, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, ఠాకూర్ ఉపేందర్సింగ్, మ హిపాల్, యాదగిరి, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి
ఆత్మకూరు(ఎం): టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును మండ లంలోని అన్ని గ్రామాల్లో విజయవంతం చేయాలని సభ్య త్వ నమోదు మండల ఇన్చార్జి పిన్నెపు నరేందర్‌రెడ్డి అన్నా రు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నా రు.మండల అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పలయ్య, రంగారెడ్డి, నాయకులు ఇంద్రారెడ్డి, భిక్షపతి, చందర్‌గౌడ్, మల్లేశం, గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు వెంకన్న, అనంతరెడ్డి పాల్గొ న్నారు. అదేవిధంగా మండల కేంద్రంతో పాటు పల్లెపహాడ్, పల్లెర్ల, మొరిపిరాల, తుక్కాపురం గ్రామాల్లో సభ్యత్వ న మోదు కొనసాగింది.ఇన్చార్జిలు రంగారెడ్డి, రమేశ్ గౌడ్, లక్ష్మారెడ్డి, నర్సింహారెడ్డి, రాజు పాల్గొన్నారు.
తుర్కపల్లి: మండల కేంద్రంతో పాటు మాదాపురం, చిన్న లక్ష్మాపూర్, వీరారెడ్డిపల్లి, మోతీరాంతండా గ్రామాల్లో స భ్యత్వాల నమోదులో పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, కోఆప్షన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు షరీఫ్, పార్టీ ప్రధాన కార్య దర్శి కరుణాకర్‌రెడ్డి, ఉప్పలయ్య, రాజయ్య, సురేందర్, మురళీ, వెంకటేశ్, ముత్యాలు, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, అయిలయ్య, హరినాయక్, కొమురయ్య, బాలింగం, నా గరాజు, ఆంజనేయులు, నర్సింహ, పరమేశ్ ఉన్నారు.
టీఆర్ఎస్ కు కార్యకర్తలే బలం
బొమ్మలరామారం: టీఆర్ఎస్కు కార్యకర్తలే అసలైన బలం అని అల్డా చైర్మన్ మోతే పిచ్చిరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ఆయన పరిశీ లించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధీర్ రెడ్డి, మండలా ధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు స్వయం ప్రభ, భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాంరెడ్డి, నా యకులు ఈశ్వర్‌గౌడ్, గణేశ్ ముదిరాజ్, శశిధర్‌రెడ్డి, పాపి రెడ్డి, దామోదర్ గౌడ్, భరత్, బాల్‌రాజ్, మహేశ్ గౌడ్, బాషయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రం సస్యశ్యామలం
గుండాల: టీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రం సస్యశ్యామలం అవు తుందని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీం దర్‌గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని సీతారాం పురంలో సభ్యత్వ నమోదు ఇన్చార్జి వేణుగోపాల్ ఆధ్వ ర్యంలో సభ్యత్వ నమోదు నిర్వహించారు.కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఖలీల్, సర్పంచ్ మాదవి, జిల్లా నే త రహీం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దశరథ, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీలు యాదగిరి, పాండరి, నాయకులు బాల్‌రెడ్డి, ఊట్ల శ్రీనివాస్, స్వామి, భిక్షం, రంజిత్‌రెడ్డి, నాగరాజు, ఉస్మాన్,సాయి పాల్గొన్నారు.
తాజావార్తలు
- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం
- అగ్రిహబ్‌కు నాబార్డ్ 9 కోట్లు
- ఉప ఎన్నికలేవైనా.. గెలుపు టీఆర్ఎస్దే
- ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి
- కరోనా టీకా తప్పక వేయించుకోవాలి
- వైభవంగా నిర్వహించాలి
- రెన్యూవబుల్ ఎనర్జీలో
- ధర్మపురి ఆలయానికి స్థపతి వల్లినాయగం
- 7న బ్రాహ్మణ పెద్దలతో మంత్రి కేటీఆర్ ఇష్టాగోష్టి
- సినీ హీరోగా సింగరేణి బిడ్డ