ఆదర్శంగా శారాజీపేట

- పూర్తయిన పల్లె ప్రగతి పనులు
- ప్రారంభానికి సిద్ధంగా రైతు వేదిక
- పచ్చదనానికి కేరాఫ్‌గా నిలుస్తున్న ప్రకృతివనం
- పారిశుధ్యానికి పెద్దపీట...ఇంటింటికీ చెత్త సేకరణ
- అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు షురూ
శారాజీపేట...అభివృద్ధిలో రాజీ పడకుండా పల్లె ప్రగతిలో ఆదర్శంగా నిలిచింది. పారిశుధ్యానికి పెద్దపీట వేస్తూ ఇంటింటికీ చెత్త సేకరణ చేస్తున్నారు. గ్రామంలో ఖాళీ స్థలం కనిపించకుండా మొక్కలు నాటడమే కాకుండా ప్రకృతివనంలో పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు పెంచారు. చుట్టుపక్కల గ్రామాలకు క్లస్టర్‌గా శారాజీపేటనే కావడంతో రైతువేదికను కూడా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఇటీవలె అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కూడా నిర్మించారు. పంచాయతీకి వచ్చిన నిధులతో అభివృద్ధిని పరుగులు పెట్టించి జిల్లాలోనే శారాజీపేట ఆదర్శ పంచాయతీగా నిలిచింది.
- అభివృద్ధిలో రాజీలేదు..
- పల్లె ప్రగతితో మారినగ్రామ స్వరూపం
- ఆదర్శంగా నిలుస్తున్న ఆలేరు మండలంలోని శారాజీపేట గ్రామం
- ఇంటింటికీ మరుగుదొడ్డి,
- మెరుగుపడిన పారిశుధ్యం
- శారాజీపేట గ్రామ జనాభా 2,485
- ఓటర్లు 2,455
- 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5.21,596లక్షలు
- ఎస్ఎఫ్సీ నిధులు రూ.1,13,123 లక్షలు
- జనరల్ ఫండ్ నిధులు రూ.41,287
- ఇంటి పన్నుల వసూలు 100శాతం
ఆలేరు రూరల్, ఫిబ్రవరి15: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి ద్వారా అభివృద్ధిలో దూసుకుపోతూ ఇ తర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది మండలంలోని శారాజీపేట గ్రామం. గ్రామస్థులు, వార్డు సభ్యుల సహకా రం..సమిష్టి కృషితో అద్భుతమైన అభివృద్ధిని సొంతం చేసుకుంటూ జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును గణతంత్ర దినోత్సవం రోజు అందుకుంది. పల్లెప్రగతిలో భాగం గా డంపింగ్‌యార్డు, పల్లెప్రకృతివనం, వైకుంఠధామం, రైతువేదిక భవనాలు నిర్మించడంతోపాటు, పారిశుధ్య పను లు, 100 శాతం ఇంటిపన్ను వసూలు చేసింది. ఆలేరు మం డలంలోని శారాజీపేటలో మొత్తం జనాభా 2,485 మంది ఉండగా, ఓటర్లు 2,455 మంది ఉన్నారు. గృహాలు 757 ఉన్నాయి. మొత్తం గ్రామ పంచాయతీకి 2018 నుంచి 2021 వరకు ఎస్ఎఫ్సీ నిధులు రూ. 1,13,123లక్షలు, గ్రామపంచాయతీ(జీపీ) జనరల్ ఫండ్ రూ. 41,287, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 5,21,596 లక్షలతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. హరితహారంలో భాగంగా 2018 లో 5,100 మొక్కలు, 2019లో 6,800 మొక్కలు, 2020లో 8,102 మొక్కలు నా టారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఎనిమిది ఇండ్లను కూల్చివేశారు. పారిశుధ్యంలో భాగంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చేందుకు గ్రామంలో రూ.2 లక్షల నిధులతో 100 మీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మించారు. పల్లె ప్రకృతివనంలో మూడు వేల మొక్కలను నాటి సంరక్షిస్తున్నా రు. వీటిలో దాదాపు 70 శాతం మొక్కలు పెరిగాయి. ఇంటింటికీ చెత్త వాహనం తిరుగుతూ తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డు లో వేస్తున్నారు. వాహనదారుల ఇబ్బందులను తొలగించేందుకు గ్రామంలో రూ.10లక్షల పంచాయతీ నిధులతో సీసీ రోడ్లు నిర్మించారు. శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన స్తంభాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రతి వీధికి ఎల్ఈడీ వీధిదీపాలను బిగించారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా గ్రామస్థులకు స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తున్నారు. వాహన కాలుష్యాన్ని అధిగమించేందుకు ప్రధాన రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు.
మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతా
పల్లెప్రగతిలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఇచ్చిన స్ఫూర్తితోనే గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. గ్రామానికి వచ్చిన ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును గ్రామస్థులకు అంకితమిచ్చా. గ్రామాన్ని సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సందర్శించేలా గ్రామస్థుల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతా.
-బండ పద్మాపర్వతాలు , సర్పంచ్, శారాజీపేట
కలిసికట్టుగా పని చేస్తున్నాం
శారాజీపేట పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేసుకున్నాం. ఇక ముందు కూడా గ్రామస్థులు, సర్పంచ్ సహకారంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతాం.
-స్వప్న, పంచాయతీ కార్యదర్శి శారాజీపేట
అన్ని పనులు జరుగుతున్నాయి
శారాజీపేటలో అన్ని పనులు జరుగుతున్నాయి. భగీరథ నీళ్లు గ్రామానికి వస్తున్నాయి. ఇం టింటికీ మరుగుదొడ్లు ఏర్పా టు చేశారు. ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తికావొచ్చాయి.
- బచ్చ అనిల్‌కుమార్ గ్రామస్థుడు
తాజావార్తలు
- ఉప్పెన దర్శకుడి రెండో సినిమా హీరో ఎవరో తెలుసా?
- నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ‘మహా’ నమూనాలు
- ఇండో-పాక్ సంబంధాల్లో కీలక పరిణామం.. మళ్లీ చర్చలు షురూ!
- రెచ్చిపోయిన పృథ్వీ షా.. మెరుపు డబుల్ సెంచరీ
- కఠిక పేదరికాన్ని నిర్మూలించాం.. ప్రకటించిన చైనా అధ్యక్షుడు
- కళ్లు దుకాణాల్లో సీసీ కెమెరాలు
- షాకింగ్ : పక్కదారి పట్టిందనే ఆగ్రహంతో భార్యను హత్య చేసి..
- క్రికెట్లో ఈయన రికార్డులు ఇప్పటికీ పదిలం..
- పవన్ కళ్యాణ్‌తో జతకట్టిన యాదాద్రి చీఫ్ ఆర్కిటెక్ట్
- వీడియో : గంటలో 172 వంటకాలు