టీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యం

- సీఎం కేసీఆర్ ఆదేశాలకనుగుణంగా పార్టీని విస్తరించాలి
- బహిష్కృత నేతలనూ తిరిగి ఆహ్వానించాలి : ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి
- పార్టీకి కార్యకర్తలే కీలకం : ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
- ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి
- హాజరైన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి వెంకటేశ్వర్లు
భువనగిరి ఫిబ్రవరి 14: టీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యమని, పార్టీ సభ్యత్వ నమోదులో భువనగిరి నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో ఉంచాలని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి పిలుపు నిచ్చారు. ఆదివారం పట్టణంలోని జయలక్ష్మీయశోద గార్డెన్స్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం, పార్టీ సభ్యత్వ నమోదులో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి వై, వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ సభ్యత్వాలను అత్యధికంగా చేపట్టి భువనగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మొదటి వరుసలో ఉంచాలన్నారు. పార్టీలో పనిచేసిన కార్యకర్తలను పలు కారణాలతో బహిష్కరించడం సరికాదని, అట్టి వారిని తిరిగి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాలన్నారు. పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు.
పార్టీకి కార్యకర్తలే కీలకం
టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కీలకమని, ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా ముందుకుసాగాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. గ్రామాలు సస్యశ్యామలంగా ఉన్నాయంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే సాధ్యమైందన్నారు. ప్రాజెక్టుల రూపకల్పన, అభివృద్ధి అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ చలువేనన్నారు. రైతులను రాజును చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. రైతు బీమా, రైతు బంధు పథకాలకు శ్రీకారం చుట్టి రైతుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారన్నారు. అన్నివర్గాలకు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు అందించాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి క్షేత్రస్థాయిలో సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకు పార్టీలో సరైన గుర్తింపు ఉంటుందని చెప్పారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఉద్యోగ, ఉపాధికల్పన
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి వై, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధికల్పన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే విస్తృతంగా చేపట్టారన్నారు. ప్రతిపక్షాల మాటలకు విలువలేదని చెప్పారు. సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతుందని గుర్తుచేశారు. ప్రతి శాఖలో నియామకాలు చేపట్టామని. అవగాహన లోపంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వారికి ప్రజలే సరైన రీతిలో బుద్ధిచెబుతారన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు.అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం కల్పిస్తుందని గుర్తుచేశారు. అంతకు ముందు అమరవీరులకు నివాళులర్పించి మౌనం పాటించారు. అనంతరం సభ్యత్వ నమోదును చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్లు నల్లమాసు రమేశ్‌గౌడ్, కునపురి కవితారాములు,పోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి, ఎంపీపీలు నరాల నిర్మలావెంకటస్వామి, మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, ఎరుకలసుధాకర్గౌడ్, జడ్పీటీసీలు సుబ్బూరు బీరుమల్లయ్య, కోట పుష్పలతామల్లారెడ్డి, గోళి ప్రణీతాపింగల్‌రెడ్డి, టీఆర్ఎస్మండల, పట్టణ అధ్యక్షులు జనగాం పాండు, రాచమల్ల శ్రీనివాస్, పాండరి, పాటి సుధాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సీత వెంకటేశం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆర్ట్ ఎగ్జిబిషన్లో సల్మాన్ పెయింటింగ్స్ ప్రదర్శన
- స్నిఫర్ డాగ్‌కు ఘనంగా వీడ్కోలు.. వీడియో
- పట్టాలెక్కనున్న మరో ఐదు ప్రత్యేక రైళ్లు
- ప్రిన్స్ సల్మాన్ ఆదేశాల ప్రకారమే జర్నలిస్టు ఖషోగ్గి హత్య
- అతివేగం, మద్యంమత్తుకు మరో ప్రాణం బలి
- ఎన్టీఆర్ మాస్క్‌పై చర్చ.. ధర తెలుసుకొని షాక్..!
- చైనా వ్యాక్సిన్‌ను పక్కన పెట్టిన శ్రీలంక
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ