యాదాద్రి బాలాలయంలో భక్తుల సందడి

- వైభవంగా నిత్య కల్యాణం,సత్యనారాయణస్వామి వ్రతాలు
- స్వామివారికి బంగారు శయనోత్సవ ఊయల, అద్దాల మండపం, మూల విరాట్‌కు బంగారు కవచం బహూకరించిన దాతలు
యాదాద్రి, ఫిబ్రవరి 13: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. కొండకింద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కొండకింద క ల్యాణకట్టతో పాటు కొండపైన ప్రసాద విక్రయ కేంద్రాలు, స్వా మివారిని దర్శించుకునే క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.
శాస్ర్తోక్తంగా నిత్యకల్యాణం..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం అర్చకులు శాస్ర్తోక్తంగా జరిపారు. కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. కల్యాణ మూర్తు లను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణతంతు నిర్వహించారు. అనం తరం దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండ పంలోనే ఊరేగించారు. ఉదయం మూడు గంటలకు సుప్రభా తం నిర్వహించిన అర్చకులు పంచనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి, హారతి నివేదనలను అర్పించారు. ఉద యం 8 గంటలకు సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరి పారు. ఆలయంలో దర్శనం అనంతరం అష్టోత్తర పూజలు కూ డా పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమా ర్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద కొలువై ఉన్న క్షేత్ర పాలక ఆంజనేయస్వామి జరిగిన పూజల్లో కూడా భక్తులు పాల్గొన్నారు. బాలాలయంలో ప్రతిష్టా మూర్తుల కు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చనల వంటి నిత్య పూ జలు వైభవంగా కొనసాగాయి.
స్వామివారిని దర్శించుకున్న హైకోర్టు రిజిస్ట్రార్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని హైకోర్టు రిజిస్ట్రార్ నా గార్జున కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామి ఆశీర్వచనం అందజేశారు.
నిత్యరాబడి రూ. 24,44,417
యాదాద్రీశుడికి నిత్యరాబడి రూ. 24,44,417 సమకూరింద ని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 2,58,862, రూ.100 దర్శనాలతో రూ. 31,400,వీఐపీ దర్శ నాలతో రూ.31,400, నిత్య కైంకర్యాలతో రూ. 600, ఉభయ ములతో రూ.1,600, క్యారీ బ్యాగులతో రూ. 7,000, ప్రచార శాఖ ద్వారా రూ.730, సత్యనారాయణ వ్రతాలతో రూ. 1,41, 000, కల్యాణకట్టతో రూ. 39,720, ప్రసాద విక్రయాలతో రూ.6,76,130, శాశ్వత పూజలతో రూ. 76,581, వాహన పూజలతో రూ.22,000, టోల్గేట్ ద్వారా రూ. 1,990, అన్న దాన విరాళంతో రూ. 3,17,279, సువర్ణ పుష్పార్చనతో రూ. 99,280, యాదరుషి నిలయంతో రూ. 86,120, పుష్కరిణితో రూ. 500, శివాలయం ద్వారా రూ. 3,200, పాతగుట్టతో రూ. 35,705, ఇతర విభాగాలతో రూ.5,94,500తో కలిపి స్వామి వారికి రూ. 24,44,417 ఆదాయం లభించిందన్నారు.
యాదాద్రీశుడి సన్నిధిలో దాతల క్యూ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో శనివారం దా తలు క్యూ కట్టారు. యాదాద్రి దేవాలయం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పలువురు భక్తులు స్వామివారికి బం గారంతో చేసిన కవచం, శయనోత్సవ, అద్దాల మండపాలను బహూకరించారు. హైదరాబాద్‌కు చెందిన జిన్నారం శ్రీహరి మూలవిరాట్‌కు అలంకరించే బంగారు కవచం, సైనిక్‌పురికి చెందిన పుట్టకోట జ్ఞానేశ్వర్ రావు దంపతులు స్వామి వారి శయ నోత్సవ మండపం, ఇంద్రసేనారెడ్డి స్వామి వారికి అద్దాల మం డపం, కొంపల్లికి చెందిన పట్టాభిరామారావు ప్రధానాలయం జూమర్ లైట్లను ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నర సింహమూర్తికి అందజేశారు. ఈ సందర్భంగా ఈవో గీత, నర సింహమూర్తి దాతలకు స్వామివారి ప్రసాదంతో పాటు ఆలయ దాతల గుర్తింపు కార్డును అందజేశారు.
తాజావార్తలు
- కామాఖ్య ఆలయాన్ని దర్శించిన ప్రియాంకా గాంధీ
- ఒక్క సంఘటనతో పరువు మొత్తం పోగొట్టుకున్న యూట్యూబ్ స్టార్
- ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
- నాలుగో టెస్ట్‌కూ అదే పిచ్ ఇవ్వండి
- ఆప్‌లో చేరిన అందగత్తె మాన్సీ సెహగల్
- తాటి ముంజ తిన్న రాహుల్ గాంధీ..
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు
- వెండితెరపై సందడి చేయనున్న బీజేపీ ఎమ్మేల్యే..!
- కేంద్రానికి తమిళ సంస్కృతిపై గౌరవం లేదు: రాహుల్‌గాంధీ
- ఎయిర్పోర్ట్ లాంజ్‌లో బైఠాయించిన చంద్రబాబు.. వీడియో