గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 14, 2021 , 01:00:30

సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి

సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి

  • ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ 

యాదాద్రి, ఫిబ్రవరి13: ప్రతి గ్రామం.. ప్రతి వాడ.. ప్రతి గడపగడపకు కలిసికట్టుగా తిరిగి టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని అధిగమించాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో 80 వేలకు మించి సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు ఆమె విజ్ఞప్తి చేశారు. శనివారం యాదగిరిగుట్ట ప        ట్టణంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ నేరుగా పలువురికి పార్టీ సభ్యత్వం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీతోనే బంగారు తెలంగాణ కల సాకారం కా నుందన్నారు. ప్రజలంతా పార్టీ వైపే చూస్తున్నారని అన్నా రు. సభ్యత్వాల సేకరణలో ఆలేరు నియోజకవర్గాన్ని అగ్ర స్థానంలో నిలుపాలన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్యకు పార్టీ క్రియాశీ ల సభ్యత్వాన్ని అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఎరుకల సుధ, వైస్‌ చైర్మన్‌ కాటంరాజు, రైతు బంధు సమితి జిల్లా డైరక్టర్‌ వెంకటయ్య, కౌన్సిలర్‌ సురేం దర్‌, నాయకులు హేమేందర్‌ గౌడ్‌, సాయి, నరహరి, బాలరాజు, అరుణ్‌ పాల్గొన్నారు. 

హయగ్రీవ స్వామి దేవస్థానంలో పూజలు

యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీహయగ్రీవ స్వామి ఆల యంలో లోక కల్యాణార్థం, విశ్వశాంతి కోరుతూ అర్చకులు లక్ష్మీనరసింహాచార్యులు మంగళ శాసనాలతో చేపట్టిన పవి త్ర యజ్ఞంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌ రె డ్డి పాల్గొన్నారు.  హయగ్రీవ స్వామి, గాయత్రి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా అర్చకులు స్వా మివారి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

 కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలి: ఎమ్మెల్యే గాదరి 

 అడ్డగూడూరు, ఫిబ్రవరి 13: కార్యకర్తలే పార్టీకి పునాది లాంటి వారని,గ్రామాల్లో ఉన్న నాయకులు సమిష్టిగా పని చేసి సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాల ని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. మండలంలోని చౌళ్లరామారం గ్రామంలో శనివారం టీఆ ర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సభ్యత్వ న మోదులో  సైనికుడిలా పనిచేయాలని అన్నారు. అంతకు ముందు మండలం జానకిపురంలో దుర్గామాత పండుగ లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్‌ఎస్‌ మండలా ధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావే శంలో ఎంపీపీ  దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి, సింగిల్‌ విండో చైర్మన్‌ వెంకటేశ్వర్లు, రైతుబంధు మండల కోఆర్డినేటర్‌ మేఘారెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మహేంద్రనాథ్‌,మాజీ ఎంపీపీ లక్ష్మి, మార్కెట్‌ కమి టీ డైరెక్టర్‌ జనార్ధన్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షు డు సోమిరెడ్డి,నేతలు కిరణ్‌, ఆంథోని,దేవగిరి  పాల్గొన్నారు.

VIDEOS

logo