కరువునేల పచ్చగా..

- స్వచ్ఛందంగా కాల్వలోపూడిక తొలగింపు
- సుమారు 100 ఎకరాల బీడు భూమి సాగులోకి..
రాజాపేట, ఫిబ్రవరి 12: గత పదిహేనేండ్లుగా వర్షాలు కురియ క చెరువులో నీటి గలగలలు లేక కంప చెట్లు పెరిగి తన ఉనికినే కొల్పోయింది. చెరువు ఆయకట్టు భూములు బీడు భూములు గా మారి పడావు పడ్డాయి. సాగు నీరు అందించే కాల్వలో మ ట్టి పేరుకపోయి ముళ్ల పొదలు పెరిగి వెక్కిరించింది. ఇది నిన్నటి వరకు పరిస్థితి ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురియడంతో చెరువుకు జలకళ సంతరించుకుంది. దీంతో కరువు నేల చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందుతుండడంతో నేడు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజాపేట మండలంలోని కుర్రారం గ్రామ శివారులో 237ఎకరాల ఆయకట్టు కలిగిన ఊర చెరు వు పదిహేనేండ్ల తర్వాత చెరువు పూర్తిస్థాయిలో నిండింది. చెరువు కింద ఉన్న చెక్ డ్యాం నుంచి పంట పొలాల వరకు ఉన్న కాల్వలో మట్టి పేరుకుపోవడంతో నీటిని పంట పోలాల కు మళ్లించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రైతులే స్వ చ్ఛందంగా ముందుకు వచ్చి రూ.1.50 లక్షలు వెచ్చించి కాల్వ లో పూడిక తీత పనులు, ముళ్ల పొదలను తొలగించారు. చెరు వు నీళ్లు కాల్వ ద్వారా పరుగులు పెడుతుండడంతో ఏన్నో ఏం డ్లుగా బీడు బారిన సుమారు 100 ఎకరాల భూమి నేడు సాగు కు నోచుకుని కరువు నేల పచ్చగా దర్శనమిస్తుంది.
బీడు భూమి సాగులోకి
ఈ ఏడాది కురిసిన వర్షాలకు చెరువు పూర్తి స్థాయిలో నిండింది. ఎన్నో ఏం డ్లుగా నీటి పారకం లేక పోవడంతో కా ల్వలో మట్టి పేరుకుపోయింది. రైతుల మంతా కలిసి స్వచ్ఛందంగా కాల్వలో పేరుకుపోయిన పూడికను తొలగించడంతోఎన్నో ఏండ్లుగా బీడుగా మారిన భూమి సాగులోకి వచ్చింది.
- ఎర్రగుంట సంజీవ, కుర్రారం ఆయకట్టు రైతు
తాజావార్తలు
- కుమార్తెను నరికి.. తలతో గ్రామంలో నడిచిన తండ్రి
- వ్యవసాయం చేయకపోతే తినడం మానేయాలి: శ్రీకారం రైటర్
- ధోనీ రికార్డును సమం చేసిన కోహ్లీ
- పీఎఫ్ వడ్డీరేటు 8.5 శాతమే
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఉర్దూ టీచర్స్ అసోసియేషన్
- ఆటగాళ్లకు కరోనా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా
- చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
- చెన్నై చేరుకున్న ధోనీ, రాయుడు..త్వరలో ట్రైనింగ్
- రాఫెల్ స్ఫూర్తితో.. ‘పంజాబ్ రాఫెల్’ వాహనం
- కురుమల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ : ఎమ్మెల్సీ కవిత