ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 13, 2021 , 00:26:49

టార్గెట్‌...80 వేల సభ్యత్వాలు

టార్గెట్‌...80 వేల సభ్యత్వాలు

  • రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఆలేరు నియోజకవర్గం ఉండాలి 
  • గడప గడపకూ టీఆర్‌ఎస్‌ పార్టీని తీసుకెళ్లాలి 
  • ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి 
  • టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ కల సాకారం 
  • సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి వై. వెంకటేశ్వర్లు

యాదగిరిగుట్టలో సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి,  జిల్లా సభ్య త్వ నమోదు ఇన్‌చార్జి వెంకటేశ్వర్లు

యాదాద్రి,ఫిబ్రవరి12: నియోజకవర్గ వ్యాప్తంగా 80వేల సభ్వ త్యాలు నమోదు చేసి, రాష్ట్రంలోనే ఆలేరును అగ్రస్థానంలో నిలుపాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పిలు పునిచ్చారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణం గుండ్లపల్లి లక్ష్మీ నరసిం హస్వామి ఫంక్షన్‌హాల్‌లో ఆలేరు నియోజకవర్గ టీఆ ర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా సభ్యత్వ నమోదు ఇ న్‌చార్జి వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభిం చారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో గ్రామాలు అభివృద్ధి బాటపట్టా య న్నారు. దేశమే గర్వపడే విధంగా యాదా ద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ అభివృద్ధి జరుగుతున్నదన్నారు. సభ్యత్వ నమోదును గడప గడపకు తీ సుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కా ర్యకర్తపై ఉందన్నారు. ప్రతి స భ్యత్వంలో ఒక పాస్‌పోర్టు సైజ్‌  ఫొటో జతపరుచాలన్నారు.

పార్టీలో కొత్త, పాత ఉండొద్దు

 సీఎం కేసీఆర్‌ సంక్షేమ,అభివృ ద్ధి పథకాలతో ఆలేరు నియోజ కవర్గ వ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి భారీగా చేరారని, పార్టీ లో కొత్త పాత అంటూ ఉండొ ద్దని టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొం గిడి మహేందర్‌ రెడ్డి హితవు పలికారు. అందరూ టీఆ ర్‌ఎస్‌ పార్టీ కుటుం బ సభ్యులేనని స్పష్టం చే శారు.సాధారణ సభ్యత్వాలు, క్రీయాశీల సభ్యత్వాలు ఉంటా యని, ప్రమాదబీమా అన్ని స భ్యత్వాలకు ఉంటుందన్నారు. పార్టీలో పనిచేసే వారికి ఎప్పు డూ సముచిత స్థానం ఉంటుం దని కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామన్నారు.

 బంగారు తెలంగాణ సాకారమయ్యే వరకు..

 నాటి  ఉద్యమ నేత, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యం లో బంగారు తెలంగాణ కల సాకారయ్యే వరకు టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉంటూ ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా సభ్యత్వనమోదు ఇంచార్జీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ స్పూర్తితో సభ్యత్వాలు నమోదు ప్రక్రియను పార్టీ శ్రేణులు జయప్రదం చే యాలన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి లకు ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వాలను అందజేశారు. కార్య క్రమంలో డీఎల్‌డీఏ చైర్మన్‌ మోతె పిచ్చిరెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్‌ భీకూ నాయక్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుధ, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుంగబాలు, జడ్పీటీసీలు అనురాధ, గోపాల్‌గౌడ్‌, అమరావతి, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షులు వెంకటయ్య, పడాల శ్రీని వాస్‌, రవీందర్‌రెడ్డి, గంగుల శ్రీనివాస్‌, ఉప్పలయ్య, దశరథ, రాజిరెడ్డి, ఎంపీపీలు సుశీల, బాలమణి, ఇందిర, సుధీర్‌రెడ్డి, రైతు జిల్లా డైరక్టర్‌ వెం కటయ్య, నాయకులు ఆంజనేయులు, రమేశ్‌, బీరయ్య, శ్రీశైలం, నర్సయ్య, పుల్లయ్య పాల్గొన్నారు. 

సభ్యత్వ నమోదులో ముందుండాలి 

 రామన్నపేట, ఫిబ్రవరి12: టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు లో నకిరేకల్‌ నియోజకవర్గాన్ని ముందుంచాలని నకిరేకల్‌ ఎ మ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. శుక్రవారం మండల కేం ద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను గడప గడపకు వివరించి సభ్యత్వం చేయించాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు  భిక్షంరెడ్డి, శ్రీనివాస్‌, నాయకులు రవీందర్‌రెడ్డి, రాములు, ద యాకర్‌, జగనోహ్మన్‌, బలరాం, ఉదయ్‌రెడ్డి, పృథ్వీరాజ్‌, సా యి, నరేందర్‌, సర్పంచ్‌లు నర్సిరెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మీనర్సు, యా దయ్య, ప్రకాశ్‌, స్వామి, ఎంపీటీ సీలు రేహాన్‌, నర్సింహా, పద్మ, ఆమీర్‌ గ్రామశాఖల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

VIDEOS

logo