ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 12, 2021 , 00:56:10

కబడ్డీ.. కబడ్డీ..

కబడ్డీ.. కబడ్డీ..

  • భూదాన్‌పోంచపల్లిలో సబ్‌ జూనియర్స్‌ జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక 

జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నేతాజీ యువజన సంఘం సహకారంతో పోచంపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సబ్‌ జూనియర్స్‌ జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక గురువారం జరిగింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సెలెక్షన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇలా కబడ్డీ కూతకు వెళ్లి అందరినీ ఉత్సాహపరిచారు. 

-భూదాన్‌పోచంపల్లి, ఫిబ్రవరి 11 : యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని భువనగిరి ఎమ్మె ల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నేతాజీ యువజన సంఘం సహకారంతో పోచంపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సబ్‌ జూనియర్స్‌ జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక  కార్యక్రమాన్ని ఆయన జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడూతూ  తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సా హం అందుతున్నదన్నారు. గ్రామీణ క్రీడాకారుల ఎంపికకు కబడ్డీ అసోసియేషన్‌ చేస్తున్న కృషి అభినందనీయన్నారు. అనంతరం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కబడ్డీ ఎంపికలో పాల్గొనే వారికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయని, వారి ని ప్రోత్సహించి జాతీయ స్థాయిలో నిలబెట్టే బాధ్యతను తాము తీసుకుంటామని తెలిపారు.  

కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మీశ్రీనివాస్‌, ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ పుష్పలతామల్లారెడ్డి, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు నాగేశ్‌, ప్రధాన కార్యదర్శి నాగయ్య, నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు కృష్ణ, యువజన సంఘం ప్రతినిధులు బాలయ్యగౌడ్‌, లింగంగౌడ్‌, వెంకటేశంగౌడ్‌, గౌరీశంకర్‌, రమేశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా సబ్‌ జూనియర్స్‌ జట్ల ఎం పిక కోసం బాలికలు, బాలుర జట్లకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. 

ముదిరాజ్‌ భవన నిర్మాణానికి రూ.5లక్షలు  

భువనగిరి అర్బన్‌, ఫిబ్రవరి 11: పట్టణంలోని తాతానగర్‌, ప్రగతినగర్‌లకు చెందిన ముదిరాజ్‌ సేవా సంఘం ఆధ్వర్యంలో నాయకులు గురువారం ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన ప్రత్యేక కార్యాలయంలో  కలిశారు. ఈ సందర్భంగా ముదిరాజ్‌ భవన నిర్మాణాన్ని కృషి చేయాలని వారు కోరగా రూ.5లక్షల సొంత నిధులను మంజూరు చేస్తూ ఎమ్మెల్యే పత్రాన్ని అందజేసినట్లు ముదిరాజ్‌ సంఘం నాయకులు గోపాల్‌, 13వ వార్డు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ముదిరాజ్‌ సంఘం నాయకులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ సేవా సంఘం అధ్యక్షుడు భిక్షపతి,  నర్సింహ, శ్రీశైలం, రాములు, దశరథ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo