మహబూబ్ పేట్ ముగిసింది

- పల్లెప్రగతితో మారిన రూపురేఖలు
- డంపింగ్ యార్డు, పల్లెప్రకృతి వనం పూర్తి
- ఇంటింటికీ చెత్త సేకరణ పారిశుధ్యానికి పెద్దపీట
పల్లెప్రగతితో మహబూబ్‌పేట మురిసింది. హరితస్ఫూర్తిని పుణికిపుచ్చుకుని పచ్చనిపల్లెగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఆ గ్రామస్థులు ఏకమయ్యారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ప్రతి ఇంటికీ 5 మొక్కలు నాటారు. వాటి సంరక్షణ బాధ్యతనూ తీసుకున్నారు. ఇపుడు ఆ మొక్కలే వారి ఇంటికి స్వాగతతోరణాలు అయ్యాయి. ఇక ప్రకృతివనంలో నాటిన మొక్కలు పల్లెకే మణిహారం అయ్యాయి. గీత కార్మికులు మరో నాలుగు ఎకరాల్లో 2000 ఈత, ఖర్జూర మొక్కలు పెట్టారు. గ్రామంలో ఖాళీ స్థలం కనిపించకుండా పూల మొక్కలు నాటి రంగు రంగుల పూలతో చక్కని హరివిల్లును నిర్మించారు. ఇంటింటికీ చెత్తను సేకరిస్తూ ఏ రోజుకారోజు డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణలో మహబూబ్‌పేట గ్రామం జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నది.
పచ్చనిమొక్కలే స్వాగత తోరణాలు
యాదాద్రి, ఫిబ్రవరి 11 : యాదగిరిగుట్ట మండలంలోని మహబూబ్‌పేట గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం గొప్పతనాన్ని గుర్తించి ఒక్కటిగా కదిలారు. పచ్చదనం, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎల్ఈడీ బల్బులు, సీసీ కెమెరాలు, ప్రతి ఇంట్లో మొక్కల పెంపకం, శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించారు. హరితహారంలో సుమారు 80 వేల మొక్కలు నాటారు. ఇంటింటికీ వెళ్లి రోజువారీగా చెత్తను సేకరిస్తున్నారు. పారిశుధ్యం, మౌలిక సదుపాయాల కల్పనలో మున్ముందుకు సాగుతూ ఇతర పల్లెలకు ఆదర్శంగా నిలుస్తున్నది. మహబూబ్‌పేటలో 230 గృహాలు ఉండగా, ప్రతి ఇంటికి మరుగుదొడ్లను నిర్మించి ఓడీఎఫ్ గ్రామంగా నిలిచింది. 200 ఇంకుడు గుంతలు నిర్మించారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామానికి 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ.12.87లక్షల నిధులు మంజూరయ్యాయి. వీటితో పారిశుధ్యం, పచ్చదనం పెంచే కార్యక్రమాలు చేపట్టారు. ఒక పాడుబడ్డ బావి పూడ్చి వేయడంతోపాటు 18 పాత ఇండ్లను కూల్చారు. 5 చోట్ల కంపచెట్లను తొలగించారు. మారమ్మ టెంపుల్‌తోపాటు 10 చోట్ల మురుగుగుంతలు పూడ్చారు. 40 ఎల్ఈడీ బల్బులను బిగించారు. గ్రామంలో 20చోట్ల బ్లీచింగ్ పౌడర్ చల్లి పారిశుధ్య పనులు చేపట్టారు. చెత్త వేసేందుక డంపింగ్ యార్డు నిర్మించారు. చెత సేకరణ, హరితహారం మొక్కల తరలింపు, ఇతర పనుల కోసం ప్రభుత్వం ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను మంజూరు చేసింది. హరితహారంలో భాగంగా రోడ్ల వెంట రెండు వేల మొక్కలు, కాలనీల్లో మరో రెండువేల మొక్కలు నాటించడంతోపాటు ప్రభుత్వం, ప్రైవేట్ స్థలాల్లో కలిపి మొత్తం 80వేల మొక్కలు నాటారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ జలం అందుతున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారాన్ని గ్రామంలో విజయవంతం చేసిన మహబూబ్‌పేట గ్రామాన్ని ప్రభుత్వం గుర్తించింది. వేలాదిగా మొక్కలు నాటి సంరక్షించినందుకు 2017 సంవత్సరం హరితమిత్ర అవార్డుకు ఎంపికైంది. గ్రామంలో నిర్మించిన పల్లెప్రకృతి వనం ప్రజలను ఆకట్టుకుంటున్నది. ప్రస్తుతం 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఖర్చులు పోను ఇంకా పంచాయతీ ఖాతాలో రూ.4.60లక్షలు మిగులు ఉండటం గమనార్హం. గతంలో ఒక్క రూపాయి కూడా లేని స్థితి నుంచి గ్రామంలో లక్షల్లో మిగులు బడ్జెట్ ఉండే స్థాయికి చేరుకున్నది. 2020 జనవరి 26 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు, ఉత్తమ సర్పంచ్ అవార్డులు వచ్చాయి. సర్పంచ్ ఆరె స్వరూపామల్లేశ్గౌడ్, ప్రత్యేకాధికారి సుప్రియ, పంచాయతీ కార్యదర్శి నరేందర్‌రెడ్డి అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతుండటంతో మహబూబ్‌పేట గ్రామం జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తుంది.
అందరి సహకారంతోనే అభివృద్ధి
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామస్థులంతా కలిసికట్టుగా తీర్మానించాం. ఇంటింటికీ చెత్త బుట్టలు అందజేశాం. ప్రతిరోజూ రోడ్లపై ఉన్న చెత్తను ఊడ్చి శుభ్రపరిచాం. కరోనా కాలంలో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు 99శాతం పెరిగాయి. గ్రామం పూర్తిగా పచ్చదనంతో నిలిచిపోయింది. అందరి సహకారంతోనే సాధ్యమైంది.ఆరె స్వరూపామల్లేశ్, సర్పంచ్, మహబూబ్‌పేట, యాదగిరిగుట్ట
వైకుంఠధామానికి జాప్యం
‘పల్లెప్రగతి’లో భాగంగా గ్రామం లో నిర్మిస్తున్న వైకుంఠ ధామం ర్మాణంలో జాప్యం జరిగింది. వైకుంఠధామం నిర్మించే భూమి పై కొంత మంది వ్యక్తు లు రెవెన్యూ కోర్టుకు వెళ్లారు. దీంతో నిర్మాణం మధ్యంతరంగా నిలిచిపోయింది. వైకుంఠధామం నిర్మాణం జరుగుతున్న స్థలం ప్రభుత్వ భూమి కావడంతో కలెక్టర్ అనితారామచంద్రన్ చొరవతో వివాదం సద్దుమణిగింది. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి.
అధికారుల పర్యవేక్షణ
‘పల్లె ప్రగతి’ పథకాన్ని ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుండటంతో మండల అధికారులు నిత్యం పర్యవేక్షించారు. సర్పంచ్ చొరవతోపాటు గ్రామస్థుల ఆసక్తితో గ్రామ ప్రత్యేకాధికారి సుప్రియ, పంచాయతీ కార్యదర్శి నరేందర్‌రెడ్డి పర్యవేక్షణ తోడుకావడంతో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
ఊరు మంచిగ మారింది..
సీఎం కేసీఆర్ సార్ ఊర్లను మంచిగ చూస్తుండు. ఊర్లల్లో జనం ఆనందంగా ఉండాలని పథకాలు అమలు చేసిండు. మా గ్రామంలో చాలా వరకు సమస్యలు తగ్గాయి. గ్రామాలను బాగు చేసేందుకు సమయానికి డబ్బులు ఇస్తుండు. సర్పంచ్‌లు కూడా మంచిగ పని చేస్తుర్రు.
చెక్కల లక్ష్మి, గ్రామస్థురాలు, మహబూబ్‌పేట, యాదగిరిగుట్ట
ఖర్జూర, ఈత మొక్కల పెంపకం
భవిష్యత్‌లో గీత కార్మికులకు ప్రయోజనకరంగా ఉంటుందనే సంకల్పంతో నాలుగు ఎకరాల్లో 2వేల ఈత, ఖర్జూర మొక్కలు నాటారు. ఈ మొక్కలు ఎండిపోకుండా ఉపాధి హామీలో సంరక్షణ చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈత మొక్కలు పచ్చగా కళకళలాడుతున్నాయి.
తాజావార్తలు
- గల్వాన్‌లో మనపై దాడిచేసిన చైనా కమాండర్‌కు అత్యున్నత పదవి
- మోదీ స్టేడియంలో కోహ్లీసేన ప్రాక్టీస్: వీడియో
- ఆ టీ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు తెలుసా..!
- జన్నేపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
- విద్యార్థులను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి
- ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్‌లోకి ఎస్బీఐ?.. అందుకే..!
- ‘బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడటమే మా ప్రాధాన్యత’
- న్యాయవాద దంపతుల హత్యకు వాడిన కత్తులు లభ్యం
- తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తాం : అసదుద్దీన్ ఒవైసీ
- ప్రచార పర్వం : టీ కార్మికులతో ప్రియాంక జుమర్ డ్యాన్స్