గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 11, 2021 , 00:14:36

యాదాద్రిలో వైభవంగా నిత్యకల్యాణం

యాదాద్రిలో వైభవంగా నిత్యకల్యాణం

  • ఘనంగా సుదర్శన నారసింహ హోమం , అష్టోత్తర పూజలు

 యాదాద్రి, ఫిబ్రవరి 10 : పంచనారసింహుడిగా విరాజిల్లు తున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నిత్య కల్యా ణం అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం వేకువ జాము నే స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాల తో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. అనంతరం లక్ష్మీ నరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి సుదర్శన నా రసింహహోమం అనంతరం లక్ష్మీనరసింహుల కల్యాణం జరి పారు. స్వామివారి అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్త రంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రోజూ ఒక్కో రకమైన పూజలు నిర్వహిస్తూ భక్తులు లక్ష్మీనృసింహుడిని కొలు స్తున్నారు. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహిం చా రు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపై శివాల యంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మ వారికి కుంకుమార్చనలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు.  

 ఖజానాకు  ఆదాయం రూ. 6,63,078 ఆదాయం

 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి రూ. 6,63,078 ఆదా యం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బు కింగ్‌ ద్వారా రూ.68,456, రూ.100 దర్శనాలతో రూ. 35, 000, నిత్య కైంకర్యాలతో రూ. 2,664, క్యారీ బ్యాగులతో రూ. 3,950, సత్యనారాయణ వ్రతాలతో రూ. 24,000, కల్యా ణకట్టతో రూ.12,720, ప్రసాద విక్రయాలతో రూ. 3,83, 170, శాశ్వత పూజలతో రూ.17,232, వాహన పూజలతో రూ.6,400, టోల్‌గేట్‌ ద్వారా రూ.1,330, అన్నదాన విరా ళంతో రూ.1,684, సువర్ణపుష్పార్చనతో రూ. 64,372, యాద రుషి నిలయంతో రూ.30,150, పుష్కరిణితో రూ. 500, పాతగుట్టతో రూ.11,450తో కలిపి స్వామివారికి రూ. 6,63, 078 ఆదాయం సమకూరింది.

వసతి గృహాలు సిద్ధం

 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా భక్తుల మౌలిక వసతుల కోసం వైటీడీఏ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కొండపై పనుల నేపథ్యంలో దర్శనా నికి వచ్చే భక్తులకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం యాదాద్రి కొండ కింద పాత గోశాల వద్ద వసతి గృహాల పనులు పూర్తయ్యాయి.

VIDEOS

logo