శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 11, 2021 , 00:19:49

హాలియాకు తరలిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు

హాలియాకు తరలిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు

  • భువనగిరి ,చౌటుప్పల్‌, ఆలేరు నుంచిపెద్ద ఎత్తున వెళ్లిన టీఆర్‌ఎస్‌ నేతలు
  • చౌటుప్పల్‌లో జెండా ఊపి బస్సునుప్రారంభించిన  మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి

 న్యూస్‌ నెట్‌వర్క్‌, నమస్తే తెలంగాణ : నల్లగొండ జిల్లా హా లియాలో బుధవారం నిర్వహించిన సీఎం కేసీఆర్‌ బహిరం గ సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున గులాబీ సైన్యం కదిలిం ది. చౌటుప్పల్‌, భువనగిరి ,ఆలేరు మున్సిపాలిటీలతోపాటు రామన్నపేట, అడ్డగూడూరు, మోత్కూరు, సంస్థాన్‌ నారా యణపురం, వలిగొండ, బీబీనగర్‌, భూదాన్‌పోచంపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, మోటకొండూర్‌, ఆత్మకూరు(ఎం), రాజాపేట, తుర్కపల్లి, బొమ్మల రామారం, గుండాల మం డలాల నుంచి టీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు బస్సులు, డీసీఎంలు, సుమోలు, సొంతకార్లల్లో భారీగా తరలివెళ్లారు. ఈసందర్భంగా ఆయా మండల కేంద్రాల్లో జెండాలు ఊపి బస్సులు, డీసీఎంలను ప్రారంభించారు. రామన్నపేటలో మహిళలు కోలాట ప్రదర్శన నిర్వహించారు. 

కేసీఆర్‌ నోట యాదాద్రి మాట..

 హలియాలో జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ యా దాద్రి దివ్యక్షేత్రంపై ప్రస్తావించారు. యాదాద్రి లక్ష్మీనరసిం హస్వామి ఆలయ పునర్నిర్మాణం ప్రపంచమే అబ్బురపో యేలా ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఆయన మాటలో నే..యాదాద్రి పుణ్యక్షేత్రం.. ఎవ్వడన్న పట్టించుకున్నడా.. మాట్లాడిండ్రా... ఇయాల యాదాద్రి దివ్యక్షేత్రం 2000 వేల కోట్ల ఖర్చుతో పూర్తి కృష్ణశిలతోని ప్రపంచమే అబ్బరప డే విధంగా తయారవుతున్నది.. అక్కడ మా ఎమ్మెల్యే గొం గిడి సునీతామహేందర్‌రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటావున్నది.. రాబోయే కొద్దిరోజుల్లో ప్రపం చమే వచ్చి చూసిపోయే విధంగా యాదాద్రిని తయారు చే యబోతూ వున్నాం...వీళ్లు కూడా పోయిండ్రు కాంగ్రెసోళ్లు యాదగిరిగుట్టకు కానీ, ఆలయాన్ని మంచిగ చేయాలని మాట్లాడిండ్రా.. ప్రయత్నం చేసిండ్రా.. చేయలే నోర్లుమూ సుకుని పడున్నరు. ఈవిధంగా మంచి పనులు చేసి, అద్భు తమైన పద్దతిలో అబివృద్ధి చేసి గొప్పగా తీసుకుపోదామని చూస్తే అడ్డుకుంటారా అన్నారు. దీంతో కేసీఆర్‌ ప్రసంగానికి ఆలేరు ప్రజానీకం జయహో కేసీఆర్‌, జయ జయహో గొం గిడి సునీతామహేందర్‌రెడ్డి నినాదాలతో స్వాగతించారు.

VIDEOS

logo