మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Feb 09, 2021 , 23:29:03

ఆదర్శం.. హెచ్‌ఎం వెంకన్నసారు

ఆదర్శం.. హెచ్‌ఎం వెంకన్నసారు

 ఆత్మకూరు(ఎం), ఫిబ్రవరి3: ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎంగా అంటే ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులపై అధికారాలు ఉం టాయి. కానీ గ్రామ ప్రజలతో మమేకమై పాఠశాలకు వచ్చే వి ద్యార్థులకు ఉత్తమ విద్యను అం దివ్వడంతో పాటు ఉపాధ్యా యులు తమ విధులు సక్ర మం గా నిర్వహించేవిధంగా కృషి చే యడంలో మండలంలోని కఫ్రా యిపల్లి ఉన్నత పాఠశాల ప్రధా నోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దడిపల్లి వెంకన్న ముందున్నారు.

ప్రభుత్వం పాఠ శాలలను ప్రారంభించగానే వి ద్యార్థుల ఇండ్లలోకి వెళ్లి పిల్లలను పాఠశాలకు పంపించాలని వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పాఠశాల ప్రారంభానికి ముందు ఆయనే స్వయంగా చీపురు చేతబట్టి పాఠశా ల పరిసర ప్రాంతాలు, గదులను శుభ్ర పర్చారు. పాఠశాల ప్రారంభమైనప్ప టికీ అటెండర్‌ లేకపోవడంతో ఇప్పటికీ తానే స్వయంగా గంట కొడుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తు న్న వెంకన్న సారును గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు.


VIDEOS

logo