మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Feb 09, 2021 , 23:21:15

మాటూరుకు మోక్షం

మాటూరుకు మోక్షం

  • జిల్లా కోపరేటివ్‌ ఆఫీసర్‌ వెంకట్‌రెడ్డి
  • ‘మాటూరులో మట్టిరోడ్లు’ కథనానికి స్పందన
  • కలెక్టర్‌ ఆదేశాలతో కదిలిన అధికారులు

 మోటకొండూర్‌, ఫిబ్రవరి 9 : మాటూరు గ్రామం లోని పెద్ద బావిలో ‘పల్లె ప్రకృతి వనం’లో ఎండి పోయిన మొక్కలను తొలగించి కొత్త మొక్కల ను కూలీలతో నాటించారు. ‘నమస్తే తెలంగా ణ’ దిన పత్రికలో మంగళవారం ‘మాటూరు లో మట్టి రోడ్లు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన కలెక్టర్‌ అనితా రామ చంద్రన్‌ అధి కారులను ఆదేశించారు. దీంతో గ్రా మానికి వచ్చిన అధికారులు రెండు గంటలు గ్రామం లోని వీధుల్లో కలియతిరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీ ఆర్‌ పల్లెలు పట్టుకొమ్మలనే సంకల్పంతో పల్లెల్లో చేపట్టిన ‘పల్లె ప్రగతి’లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని సంబంధిత పాలక వర్గానికి, కార్యదర్శిని జిల్లా అధికారి హె చ్చరించారు. మంగళవారం మండలంలోని మాటూరు గ్రామాన్ని జిల్లా కోఆపరేటివ్‌ అధికారి, మండల ప్రత్యే కాధికారి వెంకట్‌ రెడ్డి ‘పల్లె ప్రగతి’ పనుల మండల ఎంపీడీ వో వీరస్వామితో కలిసి పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ ఆదే శాల మేరకే గ్రామాన్ని సందర్శించామన్నారు. పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యంగా ఉంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుం టామన్నారు. గ్రామంలో నిర్మిస్తున్న డంపింగ్‌యార్డు నిర్మా ణాన్ని మేస్త్రితో మాట్లాడి వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని, వైకుంఠధామం పనుల్లో అడ్డంకులను తొ లగించుకొని పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయా లని సంబంధిత సర్పంచ్‌కు, అధికారులకు సూచించామ న్నారు. నర్సరీలో ఉన్న 10వేల మొక్కల్లో పెరుగని మొక్కల చోట కొత్త మొక్కలు నాటించాలని, రైతువేదికను అం దుబా టులోకి తేవాలని, డ్రైనేజీ సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, ఇండ్ల నుంచి వచ్చే మురుగునీరు డ్రైనేజీలోకి నేరుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌కు తెలిపారు.

VIDEOS

logo