90ల సమయంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రోజా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో కలిసి పని చేసింది. వెండితెరపైనే కాక బుల్లితెరపై కూడా రోజా సందడి చేస్తుంది. పలు కార్యక్రమాలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ దూసుకెళుతున్నారు. ఆర్.కె.సెల్వమణితో రోజాకి వివాహం జరగగా వారికి కౌశిక్, అన్షు అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పిల్లలని ఎంతో ప్రాణంగా ప్రేమించే రోజా వారి బర్త్‌డే వేడుకలని ఘనంగా నిర్వహిస్తూ ఉంటుంది. రీసెంట్గా తన కుమారుడు కౌశిక్ బర్త్‌డే కాగా, ఆ బర్త్‌డేని గ్రాండ్‌గా నిర్వహించినట్టు ఫొటోలని చూస్తుంటే అర్ధమవుతుంది. రోజా తన ఇన్‌స్టాగ్రాములో కుమారుడి బర్త్‌డే పిక్స్ షేర్ చేయగా, ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఇటీవల చెన్నై అడయార్‌లోని ఫోర్టీస్ మలర్ ఆస్పత్రిలో రోజాకు రెండు మేజర్ శస్త్రచికిత్సలు నిర్వహించిన సంగతి తెలిసిందే.