శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Feb 08, 2021 , 00:01:48

చలో హాలియా

చలో హాలియా

10న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ

ఆలేరు నియోజకవర్గం నుంచి 20వేల మందిని తరలిస్తాం

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి

యాదాద్రి, ఫిబ్రవరి 7 : హాలియాలో ఈనెల 10వ తేదీన జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగసభకు ఆలేరు నియోజకవర్గం నుంచి 20వేల మందిని తరలిస్తామని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలోని గొంగిడి నిలయంలో ఆలేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలతో సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు సీఎం కేసీఆర్‌ సభను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులతో చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లాల వారీగా సీఎం బహిరంగసభలు నిర్వహిస్తున్నారని తెలిపారు. 10 సభలు ఏర్పాటు చేస్తుండగా, మొదటి సభ మన ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్నారన్నారు. నల్లగొండ జిల్లా అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో ప్రేమ అని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయన్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధిపై సీఎం బహిరంగసభలో పార్టీ శ్రేణులకు వివరించనున్నారన్నారు. దేశంలో అన్ని విభాగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఒకే ప్రాంగణంలో కలుసుకోవాలన్న ఆశ సీఎం కేసీఆర్‌కు పుట్టిందన్నారు. నాణ్యమైన నిరంతర విద్యుత్‌, స్వచ్ఛమైన తాగునీరు అందడమే ఒక చక్కటి ఉదాహరణ అని అన్నారు. కార్యక్రమంలో డీఎల్‌డీఏ చైర్మన్‌ మోతె పిచ్చిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రవీందర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, జడ్పీటీసీ తోటకూరి అనురాధాబీరయ్య, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్‌ మిట్ట వెంకటయ్య, పీఏసీఎస్‌ చైర్మన్లు ఇమ్మడి రామిరెడ్డి, మల్లేశ్‌గౌడ్‌, మోటకొండూర్‌ జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, యాదగిరిగుట్ట మండల నాయకులు వంటేరు సురేశ్‌రెడ్డి, తోటకూరి బీరయ్య, కౌకుంట్ల శ్రీకాంత్‌రెడ్డి, ఆరె మల్లేశ్‌గౌడ్‌, కళ్లెపల్లి శ్రీశైలం, కవిడే మహేందర్‌, పార్టీ వివిధ మండలాధ్యక్షులు పడాల శ్రీనివాస్‌, దూదిపాల రవీందర్‌రెడ్డి, గంగుల శ్రీనివాస్‌, ఆత్మకూరు(ఎం), ఆలేరు, బొమ్మలరామారం, రాజాపేట, తుర్కపల్లి, గుండాల మండలాలకు చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

VIDEOS

logo