సహకార సంఘాల సేవలను వినియోగించుకోవాలి

మోత్కూరు, ఫిబ్రవరి 6: రైతు సహకార సంఘాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని దత్తప్పగూడెంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద సహకార సంఘ సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల శ్రేయస్సుకోసం నాణ్యమైన పెట్రోల్, డీజిల్ లీటర్‌కు ఒక రూ పాయి తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. రైతులకు విత్తనాలు, ఎరువులు మాత్రమే కాకుండా చిరు వ్యాపారులకు బైక్ రుణాలను ఇస్తున్నట్లు తెలిపారు. సహకార సంఘం చైర్మన్ అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కా ర్యక్రమంలో డీసీవో వెంకట్‌రెడ్డి, సంఘం వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు పద్మారెడ్డి, ముత్యాలు, లక్ష్మ య్య, సుజాత, సీఈవో వరలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, సోంమల్లు, సత్తయ్య, శోభాసోమయ్య తదితరులు పాల్గొన్నారు.
మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం
అడ్డగూడూరు, ఫిబ్రవరి 6: మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడుతాయని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ రామకృష్ణారెడ్డి అన్నారు. గట్టుసింగారం గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మ డి నల్లగొండ జిల్లా స్థాయి గ్రామీణ కబడ్డీ క్రీడోత్సవాలను శనివారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి , జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ జోసఫ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహేంద్రనాథ్, జనార్దన్‌రెడ్డి, సర్పంచ్ సత్తయ్య, ఎంపీటీసీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయం : మంత్రి కొప్పుల
- హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనత
- మోదీకి దీదీ కౌంటర్.. గ్యాస్ సిలిండర్‌తో పాదయాత్ర
- అధికారులను కొట్టాలన్న.. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై నితీశ్ స్పందన
- సర్కారు బెంగాల్‌కు వెళ్లింది, మేమూ అక్కడికే పోతాం: రైతులు
- ‘మల్లన్న ఆలయంలో భక్తుల సందడి’
- మహిళా ఉద్యోగులకు రేపు సెలవు : సీఎం కేసీఆర్
- ఆ సినిమాలో నా రోల్ చూసి నాన్న చప్పట్లు కొట్టాడు: విద్యాబాలన్
- విడుదలకు ముస్తాబవుతున్న 'బజార్ రౌడి'
- కూరలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి