శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Feb 06, 2021 , 00:13:44

పల్లె వికాసానికి కృషి

పల్లె వికాసానికి కృషి

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

బీబీనగర్‌ మండలం పడమటిసోమారంలో పర్యటన

పల్లె వికాసానికే  ‘పల్లెల పర్యవేక్షణ’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు  భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పల్లెల పర్యవేక్షణలో భాగంగా మండలంలోని పడమటిసోమారంలో ఆయన పర్యటించారు. గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ తీగలు తొలగించాలని, ఇండ్ల మధ్యనే మురుగునీరు నిలుస్తుందని గ్రామస్థులు ఎమ్మెల్యేకు చెప్పారు. గ్రామానికి వచ్చే బస్సులను పునరుద్ధరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వీలైనంత త్వరలో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

-బీబీనగర్‌, ఫిబ్రవరి 5  

 బీబీనగర్‌, ఫిబ్రవరి 05 : పల్లె వికాసానికి కృషి చేసేందుకు పల్లె పర్యవేక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో తిరిగి, ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని పడమటి సోమారం గ్రామంలో ఆయన ఉదయం 6 గంటలకే గ్రామానికి చేరు కొని ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సాధారణ వ్యక్తి లా ఇంటింటికీ తిరుగుతూ గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నివాసాల పైనుంచి ప్రమాదక రంగా ఉన్న విద్యుత్‌ తీగలు తొలగించాలని, అదేవిధంగా గ్రామంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం సరిగ్గా లేక ఇం డ్ల మధ్యనే మురుగునీరు నిలుస్తున్నదని, ఇందుకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. పాఠశాలలు ప్రారంభమైనందున గ్రామానికి వచ్చే బస్సుల ను పుణరుద్ధరింపచేయాలన్నారు. గ్రామ పరిధిలోని బునా దిగాని కాల్వ లోతును పెంచాలని సూచించారు. లోతు లేకపోవడంతో పక్కన పొలాల్లోకి నీరు వెళ్తుండటంతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. వీలైనంత త్వరలో సమస్యలు పరి ష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 

మంత్రి కేటీఆర్‌ స్ఫూర్తితోనే పల్లె పరిరక్షణ

 ఇటీవల పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలవడం జరిగిందని ఆయన స్ఫూర్తితోనే పల్లె పర్యవేక్షణ కార్యక్రమా నికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల్లో నెల కొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులను సమ కూర్చాలని కేటీఆర్‌ను కోరడం జరిగిందని, అందుకు ఆయ న సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చాడని అన్నారు.

నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం

 గ్రామ పర్యటనలో భాగంగా కడు నిరుపేద కుటుంబానికి చెందిన సందిగారి నర్సింహా, పాయవతి నర్సమ్మకు పైళ్ల ఫౌండేషన్‌ ఆధ్వ ర్యంలో రూ.5వేల చొప్పున ఆర్థిక సా యాన్ని అందజేశారు. కరోనాతో ఆగిన పైళ్ల ఫౌండేషన్‌ సేవ లు ఇకనుంచి కొనసాగుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

గ్రామీణ రోడ్లకు మరమ్మతులు

 ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న గ్రామీణ రోడ్ల మరమ్మతు లకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నరావులపల్లి, రాఘవాపురం, వెంకిర్యాల గ్రామాల మధ్య నూతనంగా వేస్తున్న బీటీ రోడ్డు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మండలంలో ఇప్పటికే బీబీనగర్‌-మగ్దుం పల్లి గ్రామాల మధ్య చేపట్టిన బీటీ రోడ్డు పనులు పూర్తయ్యా యని, మహదేవపురం, కొండమడుగు గ్రామాల్లో దెబ్బతి న్న రోడ్లను సైతం వీలైనంత త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ సుధాకర్‌ గౌడ్‌, జడ్పీ టీసీ ప్రణీతాపింగళ్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డి నేటర్‌  జైపాల్‌రెడ్డి, సర్పంచ్‌ గణేశ్‌యాదవ్‌, ఉప సర్పంచ్‌ చంద్రకళ, వైస్‌ ఎంపీపీ గణేశ్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చై ర్మన్‌ మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాసు లు, కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, చిన్నరావులపల్లి సర్పంచ్‌ బా లమణి, ఎంపీటీసీ బాలచందర్‌, ఉప సర్పంచ్‌ శేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగేశ్‌, వార్డు సభ్యులు, ఎస్‌ఎల్‌బీసీ ఆలయ చైర్మన్‌ బస్వరెడ్డి, మాజీ సర్పంచ్‌ జం గయ్యయాదవ్‌, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు బలవంత్‌ రెడ్డి, నాయకులు బస్వయ్య, మహిపాల్‌రెడ్డి, ముత్యాలు, భిక్షపతి, వీరారెడ్డి, లింగారెడ్డి, జనార్దన్‌, శివుడు, కిశోర్‌గౌడ్‌, ప్రభాకర్‌, పాండు, చక్రపాణి, అధికారులు పాల్గొన్నారు.  

VIDEOS

logo