భక్తుల కొంగు బంగారం కోట మైసమ్మ

కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం
జాలలోని కోటమైసమ్మ ఆలయాన్ని దర్శించుకుంటున్న జనం
రాజాపేట, ఫిబ్రవరి 5: గండిపేట మైసమ్మ రూపంలో వెలసి భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధికెక్కిన దేవాలయాల్లో జాల కోట మైసమ్మ ఆలయం ఒకటి. మైసమ్మ ఆలయాన్ని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. జాల గ్రామానికి చెందిన భక్తుడు ఠాకూర్ నారాయణసింగ్ గ్రామ శివారులో 1974లో జాల కోట మైసమ్మ ఆలయాన్ని నిర్మించాడు. జాలకోట మైసమ్మ దేవతను కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. దీంతో ప్రతి ఆదివారం, గురువారం రోజుల్లో దేవతను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఈ ప్రాంతం నుంచే కాకుండా హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి భక్తులు వందలాదిగా తరలి వస్తుంటారు. కోరిన కోర్కెలు తీరగానే దేవతకు ఒడిబియ్యం, గాజులు, పసుపు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. సల్లంగా దీవించు తల్లీ అంటూ వేడుకుంటారు. కొలిచిన వారికి భక్తుల పాలిట కొంగుబంగారంగా నిలుస్తోంది జాల కోట మైసమ్మ ఆలయం. ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా వీరాజిల్లుతున్నది.
కోరిన కోరికలు తీరుతాయి..
జాల గ్రామ కోట మైసమ్మ తల్లి ఎంతో మహిమగల దేవత. భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్న దేవతను దర్శించుకోవటానికి ఈ ప్రాంతం నుంచే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. భక్తులు కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతుండటంతో దేవతకు ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించుకొని మొక్కు లు చెల్లించుకుంటారు. ప్రతియేటా మైసమ్మ ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తాం.
-కొల్లూరి లక్ష్మి, ఆలయ పూజారి, జాల
కుల దేవతగా కొలుస్తాం
జాల కోట మైసమ్మ దేవత ఎంతో ప్రసిద్ధిగాంచింది. భక్తి శ్రద్ధలతో కొలుస్తాం, తల్లిని కొలిచాకే శుభకార్యాలు చేస్తాం. దేవతను కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయి. మా కుల దేవతగా కొలుస్తాం. ప్రతి వారం ఆలయాన్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటాం.
-సోనియా ఠాకూర్, కొత్తజాల
తాజావార్తలు
- 12 ఏండ్ల బాలిక ఖరీదు 10 వేలు!
- నేడు ప్రధాని ‘మన్ కీ బాత్’
- రేపటి నుంచి పీజీ ప్రాక్టికల్స్
- చలో పెద్దగట్టు.. లింగమంతుల జాతర నేడే ప్రారంభం
- అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌కు అనుమతి
- రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ట్రయల్ రన్
- రాష్ట్రంలో 40 డిగ్రీలకు చేరువలో ఎండలు
- 28-02-2021 ఆదివారం.. మీ రాశి ఫలాలు
- షీ టీమ్స్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిరుద్యోగులకు.. కొలువులు
- అతివేగం.. ప్రాణం తీసింది