ప్రగతి మెరిసె పల్లె మురిసె..

అభివృద్ధిలో అగ్రగామిగా దామెర పంచాయతీ
ఉమ్మడి పంచాయతీలో అభివృద్ధికి దూరం
నేడు రూ. 30లక్షలతో అభివృద్ధి పనులు
దశాబ్దాల సమస్యలకు చెక్
రెండేండ్లలో గణనీయమైన ప్రగతి
వైకుంఠధామంతో ‘అంతిమ’ కష్టాలకు చెల్లు
డంపింగ్‌యార్డుతో కంపు ‘దూరం’
అద్దంలా సీసీరోడ్లు
ఆహ్లాదం పంచుతున్న పచ్చని చెట్లు
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు
గ్రామ స్వరాజ్యం దిశగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. గతంలో అభివృద్ధికి నోచుకోని పల్లెలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. గత పాలకులు పట్టించుకోని గ్రామాలు ప్రస్తుతం అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాయి. ఇందుకు చక్కని ఉదాహరణగా నిలుస్తుంది ‘దామెర పంచాయతీ’. ఈ గ్రామం గతంలో ఉమ్మడి తంగడపల్లి పంచాయతీలో ఉండేది. అప్పుడు నిధుల లేమితో గ్రామంలో కనీస అభివృద్ధి పనులు జరుగలేదు. ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండి పూర్తిగా అపరిశుభ్రంగా కనిపించేది. ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు కాకపోవడంతో రాత్రి వేళల్లో చీకటి కమ్ముకునే పరిస్థితి. కానీ సీఎం కేసీఆర్ చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో గ్రామంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నూతన పంచాయతీగా ఏర్పడ్డ దామెరకు ప్రప్రథమ సర్పంచ్‌గా ఎన్నికైన నారెడ్డి ఆండాలు కృషితో గ్రామం రూపురేఖలు పూర్తిగా మారాయి. కేవలం రెండేండ్ల వ్యవధిలోనే రూ.30లక్షలతో అభివృద్ధి పనులు జరిగాయి.
- చౌటుప్పల్, ఫిబ్రవరి 5
చెత్త సేకరణకు ప్రత్యేక ట్రాక్టర్
దామెర క్లీన్ అండ్ గ్రీన్‌గా మారింది. గ్రామంలో రూ.7లక్షలతో ప్రత్యేక ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి ఇండ్లలోని చెత్తను సేకరిస్తున్నారు. వారంలో రెండురోజులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను ట్రాక్టర్లో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామ నుంచి శివారు వరకు పెద్దఎత్తున మొక్కల పెంపకం చేపట్టారు. నాటిన ప్రతి మొక్కనూ రక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు సుమారు 2వేల మొక్కలు నాటి సంరక్షణ చేపట్టారు. దీంతో గ్రామం పచ్చదనం పరుచుకున్నది. అంతేకాకుండా గ్రామంలో 100శాతం మరుగుదొడ్లను ఏర్పాటు చేసిన పంచాయతీగా మిగతా గ్రామపంచాయతీలకు ఆదర్శంగా నిలిచింది.
అభివృద్ధి వైపు దామెర అడుగులు
నూతన పంచాయతీగా ఏర్పడిన దామెరలో మొత్తం 8 వార్డులు ఉండగా, జనాభా 1000, ఓట్లర్లు 547 మంది ఉన్నారు. ఇంటి పన్నును 90శాతం వసూలు చేశారు. ‘పల్లె ప్రగతి’లో భాగంగా గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ నారెడ్డి ఆండాలుసాయిరెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి అవసరమైన పనులను గుర్తించారు. మొత్తం రూ.35లక్షలతో అభివృద్ధి ప్రణాళిక రూపొందించగా, రెండేండ్లలోనే రూ. 30లక్షలతో అభివృద్ధి పనులు చేశారు. గ్రామంలోని ప్రధానంగా చేపట్టాల్సిన పనులు పూర్తి చేశారు. ముఖ్యంగా గ్రామంలో పేరుకుపోయిన పిచ్చి, కంప చెట్లను తొలగించడంతోపాటు డ్రైనేజీలను శుభ్రం చేయించారు. గ్రామంలో ప్రమాదకరంగా మారిన పాత భవనాలను జేసీబీతో తొలగింపజేశారు. సీసీ రోడ్లులేని కాలనీల్లో మట్టిని పోయించడంతోపాటు వర్షం నీరు నిలిచే ప్రాంతాలను చదును చేయించారు. ముఖ్యంగా గ్రామశివార్లు, కాలనీలు, రోడ్లకు ఇరువైపులా పెద్దఎత్తున మొక్కలు నాటారు. అంతేకాకుండా రూ.2.60లక్షలతో చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. రూ.5లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, రూ.12.60లక్షలతో చేపట్టిన వైకుంఠధామం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రూ.2లక్షలతో గ్రామంలో రోడ్డు లెవలింగ్ పనులు చేపట్టారు. గ్రామంలో వైకుంఠధామం వెళ్లే రోడ్డును రూ.70లక్షలతో వెడల్పు పనులు చేశారు. ప్రతీ ఇంటికి మిషన్‌భగీరథ జలాలు అందుతున్నాయి.
నూతన పంచాయతీతో సమస్యలు పరిష్కారం
గ్రామ ప్రణాళికలో భాగంగా నూతనంగా ఏర్పడిన మా గ్రామ పంచాయతీ రూపురేఖలు మారాయి. ఇప్పటికే పారిశుధ్య పనులు చేపట్టడంతో గ్రామం క్లీన్ అండ్ గ్రీన్‌గా మారింది. హరితహారంలో భాగంగా మొక్కలను పెద్దఎత్తున నాటడంతో గ్రామం మొత్తం పచ్చదనం నిండుకుంది. కరెంట్ సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి.
- బోరెం నవీన్‌రెడ్డి, దామెర
అభివృద్ధి వైపు దూసుకుపోతున్నది
ఉమ్మడి తంగడపల్లిలో ఉన్నప్పుడు నిధుల కొరతతో దామెర అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ప్రత్యేక గ్రామంగా ఏర్పడ్డాక దామెర పంచాయతీ అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఇప్పటికే సీసీ రోడ్లు, విద్యుత్ స్తంభాలు, వైకుంఠధామం ఏర్పాటు చేశారు. వైకుంఠధామం వెళ్లే రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు గ్రామానికి కొత్త శోభను తీసుకుచ్చాయి. - కోరె సూరజ్, దామెర
విద్యుత్ సమస్య పరిష్కారం
గత మూడు దశాబ్దాలుగా విద్యుత్ సమస్యతో దామెర గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లూజ్లైన్లతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందారు. ఈ సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు అనేక పర్యాయాలు విద్యుత్ అధికారులకు మొరపెట్టుకున్నా పరిష్కారం కాలేదు. అయితే గ్రామ ప్రణాళికలో భాగంగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సమస్యను పరిష్కరించారు. ఇప్పటికే లూజ్లైన్లను సరి చేశారు. అంతేకాకుండా అవసరమైన చోట 28 నూతన విద్యుత్ స్తంభాలు, 85 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. గ్రామంలోని విద్యుత్ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించారు.
అన్ని పనులు జరుగుతున్నాయి
దామెరలో అన్ని పనులు మంచిగా జరుగుతున్నాయి. మిషన్ భగీరథ నీళ్లు కూడా వస్తున్నాయి. ఇంటింటికీ మరుగు దొడ్లు ఏర్పాటు చేశారు. ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. సర్పంచ్ అందరినీ కలుపుకొనిపోయి అభివృద్ధి పనులు చేస్తున్నారు.
- షేక్ షఫియా, దామెర
తాజావార్తలు
- కూలి డబ్బుల కోసం ఘర్షణ.. ఒకరు మృతి
- భోజనం చేశాక ఎంత సేపటికి నీళ్లు తాగాలో తెలుసా..?
- ఈ భామకు విజయ్‌దేవరకొండతో రొమాన్స్ చేయాలనుందట..!
- వీడియో : పెద్దగట్టు జాతర
- రానా తమ్ముడు హీరోగా వచ్చేస్తున్నాడు!
- రూ.45వేల దిగువకు బంగారం ధర.. అదేబాటలో వెండి
- రియల్టర్ దారుణం : పెండ్లి పేరుతో కూతురు వయసున్న మహిళపై లైంగిక దాడి!
- వెంకీ-మీనా ‘దృశ్యం 2’ షురూ అయింది
- కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచేది లేదు : ఇఫ్కో
- ఇంటి రుణంపై రూ.4.8 లక్షల ఆదా.. ఎలాగంటే..!