ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Feb 05, 2021 , 02:51:46

నూతన బార్లకు దరఖాస్తులు

నూతన బార్లకు దరఖాస్తులు

భువనగిరి ఫిబ్రవరి 4: ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతనంగా ఏ ర్పాటైన మున్సిపాలిటీల్లో కొత్త గా బార్ల ఏర్పాటుకు దరఖాస్తు లను చేపట్టింది. ఈ క్రమంలో గత నెల 25న ప్రారంభమైన బార్ల దరఖాస్తులు గురువారం వరకు 107కు చేరుకున్నాయి. కాగా గురువారం ఒక్క రోజే అత్యధికంగా దరఖాస్తులు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ నుంచి వచ్చాయని ఎక్సైజ్‌ ప్రొహి బీషన్‌ జిల్లా అధికారి కృష్ణప్రియ తెలిపారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలి టీలు చౌటుప్పల్‌, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరులకు సంబంధించి ఐదు బార్లకు దరఖాస్తులు కోరగా అందులో చౌటుప్పల్‌లో 2 బార్లకు గాను 34 దరఖాస్తులు, యాదగిరిగుట్టలో ఒక బారుకు 46 దరఖాస్తులు, ఆలేరు లో 1 బారుకు 18 దరఖాస్తులు, మోత్కూరులో 1 బారుకు 9 దరఖాస్తులు వ చ్చాయన్నారు. నూతన బార్లకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం నిబంధనలను సులభతరం చేసిందని, ఈనెల 8వ తేదీ సాయంత్రం 4గం టల వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. 10తేదీ ఉదయం 11 గంటలకు పట్టణంలోని రావి భద్రారెడ్డి గార్డెన్స్‌లో లాటరీ పద్దతి ద్వారా ఎంపిక పక్రియ చేపడుతామన్నారు.

VIDEOS

logo