శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 05, 2021 , 02:52:03

విద్యార్థులు ఇష్టపడి చదవాలి

విద్యార్థులు ఇష్టపడి చదవాలి

 బొమ్మలరామారం, ఫిబ్రవరి 4 :విద్యార్థులు ఇష్టపడి చదివిన పుడే ప్రగతిని సాధిస్తారని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన అన్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ తరువాత  పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలల్లో  చేసిన ఏ ర్పాట్లను పరిశీలించడానికి మండలంలోని జలాల్‌పూర్‌ ఉన్నత పాఠశాలను గురువారం ఆమె సందర్శించారు. పాఠశాలలోని ప్రతి తరగతి గదికి వెళ్లి విద్యార్థులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల ప్రత్యక్ష బోధనను  పరిశీలిం చారు. పదోతరగతి ఆంగ్ల పాఠంలోని వికలాంగ విద్యార్థి జీవిత వృత్తాంతాన్ని స్వయంగా తన మోబైల్‌లో వీడియోను చూపి స్తూ విద్యార్థుల్లో ప్రేరణ కలిగించారు. పోతన భాగవతంలోని ప్రహ్లాద చరిత్రలోని ఇందుకలడందులేడని సందేహం వలదు అనే పద్యాన్ని చదివి, యాదాద్రి నృసింహాస్వామి జన్మ వృత్తాం తాన్ని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం మధ్యాహ్నా భో జనాన్ని తిని సంతృప్తి వ్యక్తం చేశారు.మండల కేంద్రంలో ప్రాథ మిక పాఠశాలలోని భవిత సెంటర్‌ను పరిశీలించారు. కార్యక్ర మంలో జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైనీ, సెక్టోరియల్‌ అధి కారి రఘరాంరెడ్డి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ రంగ రాజన్‌, ఏపీవో శ్రీనివాస్‌,  ఎంపీపీ సుధీర్‌ రెడ్డి, ఎంపీడీవో సరి త, సర్పంచ్‌లు వెంకటేశ్‌, మహేశ్‌ గౌడ్‌, ప్రధానోపాధ్యాయులు నాగార్జున, వెంకటలక్ష్మి, సీఆర్‌పీలు శ్రీహరి, విశ్వరూపం, ఐఈ ఆర్‌టీలు సరళ, జ్యోతి, చంద్రశేఖరర్‌ రెడ్డి పాల్గొన్నారు.

VIDEOS

logo