మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Feb 05, 2021 , 02:52:00

మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి , ఏఎంసీ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌

మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి , ఏఎంసీ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌

 భువనగిరి అర్బన్‌, జనవరి 4: తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ను హై దరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో గురువారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి సమక్ష్యంలో నూతన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నల్లమాస రమేశ్‌గౌడ్‌ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. బీబీనగర్‌ మండలం గూడూరు రెవెన్యూ పరిధిలోని ప్రస్తుత కలెక్టరేట్‌ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నంబర్‌ 69లో ఉన్న 18 ఎకరాల భూమిలో భువనగిరి నూతన మార్కెట్‌ యార్డు ఏర్పాటుకు 2017లో కలెక్టర్‌ ఆమో దం తెలిపారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, భూమిని స్వాధీన పర్చుకుని మోడల్‌ మార్కెట్‌ నిర్మాణం చేపట్టుకోవాలని చెప్పినట్లు రమేష్‌గౌడ్‌ తెలిపారు. ప్రస్తుత మార్కెట్‌ సముదాయం 7ఎకరాల్లో ఉండడం తో మార్కెట్‌కు వచ్చే రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, నూత న మార్కెట్‌ భవనం నిర్మాణం చేపడితే రైతు సమస్యలు తీరుతాయన్నారు. మంత్రిని కలిసిన వారిలో భువనగిరి ప్రాధమిక వ్యవసాయ సహకార సం ఘం చైర్మన్‌ నోముల పరమేశ్వర్‌రెడ్డి ఉన్నారు.

VIDEOS

logo