మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Feb 05, 2021 , 02:52:00

వైభవంగా అష్టోత్తర శతఘటాభిషేకం

వైభవంగా అష్టోత్తర శతఘటాభిషేకం

యాదాద్రి, ఫిబ్రవరి4: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో స్వామి వారి స్వాతి నక్షత్రం సందర్భంగా గురువారం అష్టోత్తర శతఘటాభిషేకం వైభవంగా నిర్వ హించారు.యాదాద్రిబాలాలయంలో తెల్లవారుజాము 4 గంటల నుంచి ఐదున్నర వరకు గిరిప్రదక్షిణలో భక్తులు అ ధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో మూడున్నర గం టల పాటు శ్రీవారికి శతఘటాభిషేకం కనుల పండువగా నిర్వహించారు. బాలాలయం ప్రతిష్టామూర్తులకు నిజాభిషే కం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరి పారు. ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంట లకు నిర్వహించిన సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొ లిచారు. సదుర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపా రు. ప్రతిరోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు.ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా కల్యాణమూర్తులను అధిష్టించి సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరి పారు. ఆలయంలో దర్శంన అనంతరం రూ. 100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి.

స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు

 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని డీసీపీ నారాయణరెడ్డి, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు, అధికారులు స్వామివారి ప్రత్యేక ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. మజీ ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్‌ నాయకుడు కాటేకార్‌ పవన్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

శ్రీవారి ఖజానాకు రూ. 8,91,165 ఆదాయం 

 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఖజానాకు రూ. 8, 91,165 సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ.1,11,004,  రూ. 100 దర్శ నాలతో రూ.32,000, క్యారీ బ్యాగులతో రూ. 5,600, ప్రచారశాఖతో రూ. 1,210,  సత్యనారాయణస్వామి వ్ర తాలతో రూ. 54,000, కల్యాణకట్టతో రూ. 20,000, ప్ర సాద విక్రయాలతో రూ. 4,61,460, శాశ్వత పూజలతో రూ.8,500, వాహనపూజలతో రూ.11,200, టోల్‌గేట్‌ ద్వారా రూ. 1,050, అన్నదాన విరాళంతో రూ.15,080, సువర్ణపుష్పార్చనతో రూ. 60,676, యాదరుషి నిలయం తో రూ. 62,380, పుష్కరిణితో రూ. 300, పాతగుట్టతో రూ. 21,045, ఇతర విభాగాలతో రూ. 10,580తో కలిపి స్వామికి రూ. 8,91,165 ఆదాయం లభించిందన్నారు.

  స్వామి వారి 15 రోజుల హుండీ లెక్కింపు

 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి 15 రోజుల హుండీ ల ఆదాయం రూ.70 లక్షలు దాటిందని యాదాద్రి ఆలయ ఈవో గీత తెలిపారు. గురువారం యాదాద్రి కొండపై హరి త హోటల్‌లో హుండీలను లెక్కించామని, నగదు 70, 27,047 రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పారు. మిశ్రమ బంగారం 50 గ్రాముల 500 మిల్లీ గ్రాములు, మిశ్రమ వెండి కిలో 900 గ్రాములు వచ్చిందని తెలిపారు. 

స్థానాచార్యుల రాజీనామా ఆమోదం..

 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్థానాచా ర్యులుగా ఉన్న సందుగుల రాఘవాచార్యుల రాజీనామాను ఈవో గీతారెడ్డి ఆమోదించారు. గత నెలలో పలు వ్యక్తిగత కారణాలతో స్థానాచార్యులు రాజీనామా చేసిన సంగతి వి ధితమే. ఈ నేపథ్యంలో ఇచ్చిన రాజీనామాను వెనక్కి తీసు కుని విధుల్లోకి రావాలని నెల సమయం ఇచ్చినా ఆయన నుంచి స్పందన రాకపోవడంతో రాజీనామాను ఆమోదిం చినట్లు తెలిపారు. ఈమేరకు రాజీనామా పత్రాన్ని దేవాదా య కమిషనర్‌కు పంపినట్లు తెలిపారు.

అర్చకుడిపై వేటు

 యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అర్చకుడి గా విధులు నిర్వర్తిస్తున్న రాంప్రసాద్‌పై పలుమార్లు ఆరోప ణలు వచ్చిన నేపథ్యంలో ఆయనను విధుల నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. 

 శివాలయ ద్వారాలకు దర్వాజలు

 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధాలయమైన శివాలయ ప్రాకారానికి గల ద్వారాలకు బిగించిన దర్వా జలు భక్తులకు ఆకట్టుకునేలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన అనురాధ టింబర్‌ డిపో వద్ద టేకు చెక్కుతో ప్రత్యే కంగా తయారు చేయించారు. ఈ ధర్వాజలకు శివాలయా నికి ద్వారపాలకులుగా ఉన్న భృంగీ, నందీలతో పాటు పు ష్పాల ఆకృతులు ఎంతగానో ఆకట్టుకోనున్నాయి. ఇప్పటికే శివాలయ త్రితల గోపురానికి ధర్వాజను బిగించగా, గు రువారం తూర్పు, దక్షిణం, పడమర భాగంలో గల ప్రాకా రాలకు దర్వాజలను బిగించారు.

VIDEOS

logo