శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Feb 04, 2021 , 00:04:09

యాదాద్రిలో వైభవంగా నిత్యకల్యాణం

యాదాద్రిలో వైభవంగా నిత్యకల్యాణం

ఘనంగా అష్టోత్తర పూజలు

పూజల్లో పాల్గొని తరించిన భక్తులు

 యాదాద్రి, ఫిబ్రవరి 3: పంచనారసింహుడిగా విరాజిల్లు తున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో నిత్య కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది.  బుధవారం వేకువజామునకే స్వయంభులకు, బాలాలయ కవచమూ ర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ వి గ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసీ అర్చనలు జరిపారు. అనంతరం లక్ష్మీనరసింహులను దివ్య మనోహ రంగా అలంకరించి సుదర్శన నారసింహహోమం అనంత రం లక్ష్మీనరసింహుల కల్యాణం జరిపారు. స్వామివారి అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తరంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రతిరోజూ ఒక్కో రకమై న పూజలు నిర్వహిస్తూ భక్తులు లక్ష్మీనృసింహుడిని కొలుస్తు న్నారు. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించా రు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపైన శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరి గాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొన్నారు.  

శ్రీవారి ఖజానాకు రూ. 8,36,189 ఆదాయం 

 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఖజానాకు రూ. 8,36,189 సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ. 93,160,  రూ. 100 దర్శనా లతో రూ.36,000, క్యారీబ్యాగులతో రూ.5,280, ప్రచార శాఖతో రూ. 1,120,  సత్యనారాయణస్వామి వ్రతాలతో రూ. 34,000, కల్యాణకట్టతో రూ.15,680, ప్రసాద విక్ర యాలతో రూ.4,86,000, శాశ్వత పూజలతో రూ. 12, 000, వాహనపూజలతో రూ.5,700, టోల్‌గేట్‌ ద్వారా రూ.1,030, అన్నదాన విరాళంతో రూ.9,984, సువర్ణ పు ష్పార్చనతో రూ.76,640, యాదరుషి నిలయంతో రూ. 36,800, పుష్కరిణితో రూ. 400, పాతగుట్టతో రూ. 16, 275, ఇతర విభాగాలతో రూ. 5,520తో కలిపి స్వామి వారికి రూ. 8,36,189 ఆదాయం లభించిందన్నారు.

రూ. 25 లక్షల బంగారం అందజేసిన నిర్మాత 

 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి ప్రముఖ వారా హి చలనచిత్ర అధినేత సాయి కొర్రపాటి రూ.25 లక్షల విలువ గల బంగారాన్ని ఆలయ ఈవో గీత, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావుకు బుధవారం అందజేశారు. స్వామి వారికి బం గారు కవచం నిర్మించేందుకు తమవంతుగా బంగారాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.  అర్చ కులు, అధికారులు స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదం అం దజేశారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత పురాణ పండ శ్రీనివాస్‌, ఆలయ అధికారులు పాల్గొన్నారు. 

రింగురోడ్డు పనులు వేగవంతం

 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కొండ చుట్టూ నిర్మించే రింగురోడ్డు పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే గడ్డి చెరువుతో పాటు ప్రెసిడెన్షియల్‌ షూట్‌, నూ తనంగా నిర్మిస్తున్న పుష్కరిణి ఘాట్‌ వద్ద రింగురోడ్డు పును లు పూర్తి చేసుకోగా, యాదగిరిగుట్ట హైస్కూల్‌, గోశాల ప్రాంతాల్లో రింగురోడ్డు నిర్మించేందుకు పనుల్లో వేగం పెం చారు. రోడ్డు నిర్మాణంలో ఇండ్లు, దుకాణాలు కోల్పోతున్న బాధితులు స్వచ్ఛందంగా ముందుకు రాగా వారి ఇండ్లు, దుకాణాలు కూల్చివేస్తున్నట్లు తాసిల్దార్‌ అశోక్‌రెడ్డి తెలిపా రు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


VIDEOS

logo