సోమవారం 01 మార్చి 2021
Yadadri - Feb 04, 2021 , 00:04:07

సమస్యల పరిష్కారానికే పల్లెల పర్యవేక్షణ

సమస్యల పరిష్కారానికే పల్లెల పర్యవేక్షణ

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే ‘పల్లెల పర్యవేక్షణ’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం పల్లెల పర్యవేక్షణలో భాగంగా భువనగిరి మండలంలోని సిరివేణికుంట, నందనం గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ... గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా సమగ్ర చర్యలు తీసుకుంటామన్నారు.   

-భువనగిరి, ఫిబ్రవరి 3 

 భువనగిరి ఫిబ్రవరి 3: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరి ష్కారానికి పల్లెల పర్యవేక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎ మ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం పల్లెల పర్యవేక్ష ణలో భాగంగా మండలంలోని సిరివేణికుంట, నందనం గ్రామాల్లో  పర్యటించి ప్రజలను అడిగి సమస్యలు తెలుసు కున్నారు. గ్రామాల్లో ఏ ఇబ్బందులకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించేలా ప్రణాళికలు తయారుచేసుకోవాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధు లు సమిష్ఠిగా గ్రామాల అభివృద్ధిలో మమేకం కావాలన్నా రు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌, జడ్పీటీసీ మల్లయ్య, పీఏఈసీఎస్‌ చైర్మన్‌ పరమేశ్వర్‌ రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాండు, ఓంప్రకాశ్‌ గౌడ్‌, నేతలు లక్ష్మీనారాయణగౌడ్‌, రాజేశ్వర్‌రావు, మధు సూదన్‌రెడ్డి, వెంకట్‌గౌడ్‌, రాఘవేందర్‌రెడ్డి, మహేందర్‌ రెడ్డి, కృష్ణ, ధనుంజయగౌడ్‌, నాగేంద్రబాబు, ప్రవీణ్‌గౌడ్‌ సర్పంచ్‌లు ప్రభాకర్‌, అనిత, బుచ్చిరెడ్డి, ఎంపీటీసీ మల్లేశ్‌ యాదవ్‌, వెంకటేశ్‌,  పారిజాత, ఉపసర్పంచ్‌ రమేశ్‌ గౌడ్‌, గ్రామాధ్యక్షుడు శంకరయ్య, నాగరాజు పాల్గొన్నారు

VIDEOS

logo