పక్కా ప్రణాళికతో.. సాగు లెక్క

యాసంగి సాగు వివరాలు సేకరిస్తున్న వ్యవసాయశాఖ
ఇప్పటికే 90 శాతం సర్వే పూర్తి
ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు
ముందుగానే దిగుబడి అంచనా వేయనున్న అధికారులు
జిల్లాలో అత్యధికంగా వరి సాగు 1,44,762 ఎకరాలు
అన్నదాతకు అండగా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. పంట దిగుబడికి అనుగుణంగా మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. అందుకోసం పంటల వివరాల నమోదు చేపడుతున్నది. రైతులు ఏ సర్వేనంబర్‌లో ఏ పంట, ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పంటల వివరాలను సేకరించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. క్లస్టర్లవారీగా ఏ పంట ఎంత మేరకు దిగుబడి వస్తుందనేది వ్యవసాయశాఖ అధికారులు ముందుగానే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు.
- భువనగిరి కలెక్టరేట్/ ఆలేరు రూరల్, ఫిబ్రవరి 3
భువనగిరి కలెక్టరేట్/ఆలేరు రూరల్, ఫిబ్రవరి 3 : యాసంగి సీజన్లో సాగు చేస్తున్న పంటలను ఆన్లైన్లో నమోదు చేసే కార్యక్రమం జిల్లాలో వేగంగా కొనసాగుతున్నది. జిల్లాలో వనరులు, నేలలు, భూసారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సర్వేను పక్కాగా చేసేలా వ్యవసాయాధికారులను ఇది వరకే సన్నద్ధం చేసింది. ప్రస్తుతం ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారనే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో ఇప్పటికే 1.70 లక్షల ఎకరాల వరి పంటను సాగు చేశారు. ఇంకా కొన్నిచోట్ల పనులు కొనసాగుతున్నాయి. గత 15 రోజుల నుంచి వ్యవసాయ అధికారులు జిల్లాలోని అన్ని మండలాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి ఏ సర్వే నంబర్లో ఏ ఏ పంటలు సాగు చేశారో అడిగి తెలుసుకుంటున్నారు.
క్షేత్రస్థాయికి వెళ్లి...
రైతులు తమ పొలాల్లో ఏ పంటలు వేశారనే వివరాలను అధికారులు తప్పనిసరిగ్గా సేకరించాలి. ఇందుకు వ్యవసాయ శాఖ చేపట్టిన పంటల సాగు సర్వేను ప్రామాణికంగా తీసుకుంటుంది. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పంటల వివరాలు నమోదు చేస్తున్నారు.
వ్యవసాయ భూములు సర్వే నంబర్ల ఆధారంగా గుర్తిస్తూ ఆన్లైన్లో పొందుపరుస్తారు. పంటల సాగు వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులను కోరుతున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మాట్లో సాగు వివరాలను నమోదు చేస్తున్నారు. గత 20 రోజుల నుంచి పంటల సాగు వివరాల ప్రక్రియ కొనసాగుతున్నది. మరో నాలుగు రోజుల్లో మిగిలిన పంటల సాగు సర్వే చేయనుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఏ సర్వే నంబర్లో ఏ పంట..
పంట సాగు వివరాల ద్వారా ఏ సర్వే నంబర్లో ఏ ఏ పంటలు సాగు చేశారో తేలనున్నది. వ్యవసాయ శాఖ క్లస్టర్ల వారీగా పంటల సాగు వివరాలను సేకరిస్తున్నారు. సాగు వివరాల లెక్క పక్కాగా ఉండనున్నది. సాగు వివరాలతో ఏ పంట వల్ల ఎంత దిగుబడి వస్తుంది? దిగుబడికి అనుగుణంగా మార్కెట్‌ను ఏర్పాటు చేయడం, కచ్చితంగా పంటల వివరాలు తెలియడం, పంటలు దెబ్బతింటే ఒక రైతుకు ఎంత మేర నష్టం వచ్చిందనే వివరాలు పక్కాగా తెలిసే ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ శాఖ క్లస్టర్లవారీగా ఆ శాఖ అధికారులు, రైతుబంధు సమన్వయ సమితి సభ్యులు పంటల సాగు వివరాల నమోదులో నిమగ్నమయ్యారు. మన రాష్ట్ర అవసరాలకు సరిపడా చూసుకొని ఏ పంటను ఏ రాష్ట్రానికి ఎగుమతి చేసుకొవచ్చనో అనే ప్రణాళికను ముందే రూపొందించుకోవచ్చు. పంటల సాగు వివరాలను నమోదు చేయించుకోవాలని ప్రతి రైతు సెల్‌ఫోన్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో సందేశాన్ని వ్యవసాయశాఖ అధికారులు పంపించారు.
జిల్లాలో అత్యధికంగా వరి సాగు...
జిల్లాలో ఈసారి వరి సాగు ఎక్కువగా జరుగుతుంది. ఈసారి సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. ఈ యాసంగికి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,44,762 ఎకరాలు వరి పంట వేయగా, మరో 40వేలకు పైగా ఎకరాలలో ఇంకా పంట సాగు చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. దీంతోపాటుగా మొక్కజొన్న 10, వేరుశనగా 21, శనగలు 17, పెసర్లు 45, ఉలవలు 11, జొన్నలు 700, గోధుమలు 2.11, మినుములు 75, పొద్దుతిరుగుడు 2.5 ఎకరాల్లో సాగు చేసినట్లు అధికారులు రైతుల నుంచి క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించారు.
రైతుల వారీగా సర్వే...
రైతుల పాసు పుస్తకాలు, సర్వే నంబర్ల ఆధారంగా పంటల సాగుపై నమోదు ప్రక్రియను చేపడుతున్నాం. గత పది రోజుల నుంచి వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో తిరిగి పంట వివరాలు నమోదు చేస్తున్నారు. సర్వే వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. రైతులకు పంటల దిగుబడులు వచ్చాక ప్రభుత్వ మద్దతు ధర అందించడానికి అవకాశం కలుగుతుంది. రైతులు పంట వివరాలు నమోదు చేసుకోవడం వల్ల పంట అమ్మకం సమయంలో సులువుగా ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో 90 శాతం సర్వే పూర్తి అయింది.
- అనురాధ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి, యాదాద్రి భువనగిరి
తాజావార్తలు
- ప్రయాణాల్లో ఆహార చిట్కాలు
- కుమార్తెను నరికి.. తలతో గ్రామంలో నడిచిన తండ్రి
- వ్యవసాయం చేయకపోతే తినడం మానేయాలి: శ్రీకారం రైటర్
- ధోనీ రికార్డును సమం చేసిన కోహ్లీ
- పీఎఫ్ వడ్డీరేటు 8.5 శాతమే
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఉర్దూ టీచర్స్ అసోసియేషన్
- ఆటగాళ్లకు కరోనా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా
- చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
- చెన్నై చేరుకున్న ధోనీ, రాయుడు..త్వరలో ట్రైనింగ్
- రాఫెల్ స్ఫూర్తితో.. ‘పంజాబ్ రాఫెల్’ వాహనం