సోమవారం 01 మార్చి 2021
Yadadri - Feb 02, 2021 , 00:03:13

బడిగంట మోగింది

బడిగంట మోగింది

జిల్లాలో ప్రారంభమైన పాఠశాలలు, కళాశాలలు 

తల్లిదండ్రుల అంగీకార పత్రాలతో అనుమతి 

విద్యార్థులు, ఉపాధ్యాయులకు థర్మల్‌ స్క్రీనింగ్‌

సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ బడిగంట మోగింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జిల్లాలోని విద్యాసంస్థలు సోమవారం ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రుల అంగీకార పత్రాలతో విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. ఉపాధ్యాయులు, సిబ్బందితోపాటు విద్యార్థులందరికీ థర్మల్‌స్క్రీనింగ్‌ చేశారు. మాస్క్‌లు ధరించి వచ్చిన విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ తరగతి గదుల్లో పాఠాలు విన్నారు.

 - భువనగిరి అర్బన్‌, ఫిబ్రవరి 1

 యాదాద్రి/భువనగిరి అర్బన్‌, ఫిబ్రవరి 1: జిల్లాలో ప్రభుత్వ మోడల్‌, కేజీబీవి, గురుకుల పాఠశాలలు, ప్రైవేటు జూనియర్‌ కళాశాల లు మొత్తం 60 సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థుల వెంట తల్లిదండ్రుల అంగీకార పత్రాలు ఉంటేనే తరగతి గదిలోకి కళాశాల సిబ్బంది అనుమతించారు. విద్యార్థు లకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, సిబ్బందికి కళాశాల లోకి వెళ్లే ముందు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశారు. కళాశాలలో ఐసొలే షన్‌ గదిని అందుబాటులో ఉంచారు. జిల్లాలో ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో 1985 విద్యార్థులకు 609 విద్యార్థులు హాజ రైనట్లు జిల్లా ఇంటర్మీడియెట్‌ నోడల్‌ అధికారి రమణి తెలిపా రు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సంద ర్శించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు అందుబాటులో ఉంచాలని, వైద్యసిబ్బంది, మాస్కు లు, థర్మల్‌ స్క్రీనింగ్‌తో పాటు భౌతికదూరం పాటించే విధం గా జాగ్రత్తలు వహించాలన్నారు. విద్యార్థుల మధ్య 6 ఫీట్ల దూరం ఉండేలా కళాశాల సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. 

జిల్లాలో ప్రారంభమైన 185 పాఠశాలలు

 జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 185 కరోనా నిబంధన లతో ప్రారంభించారు. 185లో మొత్తం విద్యార్థులు 14,752 మంది ఉండగా 6,600 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి రోజు పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సా యంత్రం 4.45 గంటల వరకు నడిచాయి. అన్ని పాఠశాలల్లో ని బంధనలకు అనుగుణంగా మాస్క్‌లు, గ్లౌస్‌లు ధరించి ఎజె న్సీల నిర్వాహకులు మధ్యాహ్న భోజనం వడ్డించారు. 

 గుండాలలో

గుండాల:  మండలంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌ మరియు జూనియర్‌ కళాశాల్లో సోమవారం 9, 10వ తరగతులు, ఇంటర్‌ మొదటి సంవత్స రం, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభమ య్యాయి. మండల వ్యాప్తంగా 416 గాను 229 మంది విద్యా ర్ధులు హాజరైనట్లు ఎంఈవో శ్రీధర్‌ తెలిపారు.

 ఆత్మకూరు(ఎం)లో

ఆత్మకూరు(ఎం), ఫిబ్రవరి1: మండల కేంద్రంతో పాటు కూరె ళ్ల,పల్లెర్ల, కొరటికల్‌, కఫ్రాయిపల్లి, పల్లెపహడ్‌ ఉన్నత పాఠశాల లతో పాటు కసూర్బా పాఠశాలలో బడిగంటలు మ్రోగాయి. మండలంలోని ఉన్నత పాఠశాలలో 9,10 తరగతుల్లో 502 మంది విద్యార్థులు ఉండగా 9వ తరగతికి 107 మంది, 10వ తరగతికి 167 మంది విద్యార్థులు హాజరయ్యారు.వారికి ఎస్‌ ఎంసీ చైర్మన్‌ భారతి మాస్కులు పంపిణీ చేశారు.

 మోటకొండూర్‌లో

మోటకొండూర్‌, ఫిబ్రవరి1: మండలంలో ఏడు ప్రభుత్వ పా ఠశాలలు, మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతి బాపూలే గు రుకుల పాఠశాలను ప్రభుత్వ నిబంధనలతో ప్రారంభించారు.

 తుర్కపల్లిలో

 తుర్కపల్లి, జనవరి 1: మండల వ్యాప్తంగా ఉన్న 9 జడ్పీహెచ్‌ ఎస్‌, ఆదర్శ పాఠశాల కలుపుకొని 1098 మంది విద్యార్థులకు గాను మొదటి రోజు 458మంది విద్యార్థులు హజరయ్యారు. ముల్కలపల్లి పాఠశాలలో మధాహ్న భోజన ఎజెన్సీ సభ్యులు రాకపోవడంతో ఇద్దరు ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం వండి విద్యార్థులకు పెట్టారు.

చౌటుప్పల్‌లో

చౌటుప్పల్‌: చౌటుప్పల్‌ మండలం, మున్సిపాలిటీ వ్యాప్తంగా 21 ప్రభుత్వ, 11 ప్రైవేట్‌ పాఠశాలలు తెరుచుకు న్నాయని ఎంఈవో పాండునాయక్‌ తెలిపారు. 

మోత్కూరులో

మోత్కూరు: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 689 మంది విద్యార్థులకు  211మంది తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు హాజరయ్యారు. ప్రైవేట్‌ విద్యా సంస్థ ల్లో 466 మందికి 220 మంది, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లో 219 మందికి 40 మంది హాజరయ్యారు. అడ్డగూడూరు లో 191మందికి 117 మంది, గురుకుల పాఠశాలలో 319 మందికి నలుగురు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 77 మందికి ఒకరు హాజరైనట్లు ఎంఈవో శ్రీధర్‌ తెలిపారు.

జాగ్రత్తలు పాటిస్తూ ఉత్తమ విద్య అందిస్తాం

10 నెలల తరువాత ప్రభుత్వ పాఠశాల లను ప్రారంభించడం సంతోషంగా ఉం ది.ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు ఆనందపడుతున్నారు. కష్టమైనప్పటికీ ఉపాధ్యాయులందరం జాగ్రత్తలు పాటి స్తూ విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తాం. 9,10 తరగ తుల విద్యార్థులకు ఇన్ని రోజులు ఆన్‌లైన్‌లో చెప్పిన తరగ తులను తిరిగి తరగతిగదిలో బోధిస్తాం.ప్రతి విద్యార్థికి మంచి విద్య అందించి వందశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృ షి చేస్తాం. - శ్రావణ్‌ కుమార్‌, ఉపాధ్యాయుడు, ఆత్మకూరు(ఎం)

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈవో

వలిగొండ, ఫిబ్రవరి 01: మండలంలోని లోతుకుంట గ్రామ పరిధిలోని ఆదర్శ పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశా లలను జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో చేపట్టిన పరిశుభ్రత, శానిటైజేషన్‌, హాస్టళ్లలో ఆహార పదార్థాల నాణ్యత, విద్యార్థుల భోజన ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తి గత పరిశుభ్రత పాటిస్తూ మాస్కులు ధరించే విధంగా ఉపాధ్యా యులు చూడాలని సూచించారు. కార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారి అండాలు, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ రాము, కస్తూ ర్బా పాఠశాల అధికారి దుర్గ, మహమ్మద్‌ అలీ పాల్గొన్నారు.


VIDEOS

logo