శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Feb 02, 2021 , 00:03:13

జిల్లా గ్రంథాలయ నిర్మాణానికి నిధులు మంజూరు

జిల్లా గ్రంథాలయ నిర్మాణానికి నిధులు మంజూరు

జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయింపు

గ్రౌండ్‌, మొదటి అంతస్తుతో భవననిర్మాణం

మొదటి విడుతలో రూ.40 లక్షలు మంజూరు

జిల్లాలో 16 శాఖ గ్రంథాలయాలు

ప్రారంభం కానున్న నిర్మాణ పనులు 

భువనగిరి అర్బన్‌, ఫిబ్రవరి 1: తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 33 జిల్లాలో జిల్లా గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే కొన్ని జిల్లాలో పూర్తి కాగా, కొన్ని చివరి దశలో ఉన్నాయి. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పనులు కరోనా నేపథ్యంలో నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులను కేటాయించింది. దీంతో పట్టణంలోని హైదరాబాద్‌ చౌరస్తా సమీపంలోని ప్రభుత్వ స్థలంలో భవన నిర్మాణం చేసేందుకు జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆమోదంతో 2019 డిసెంబర్‌లో జిల్లా గ్రంథాలయ సంస్థ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

జిల్లాలో 16 గ్రంథాలయాలు...

జిల్లాలో 16 శాఖ గ్రంథాలయాలు ఉన్నాయి. అందులో ఆత్మకూర్‌(ఎం), ఆలేరు, బీబీనగర్‌, బొమ్మలరామారం, చౌటుప్పల్‌, గుండాల, మోత్కూరు, సంస్థాన్‌నారాయణపురం, భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట, రాజాపేట, తుర్కపల్లి, వలిగొండ, ఆలేరు మండలంలోని కొలనుపాకతోపాటు  భువనగిరిలో జిల్లా గ్రంథాలయం ఉన్నది. జిల్లాలో మరో రెండు కొత్తగా మోటకొండూర్‌, అడ్డగూడూర్‌లో ఏర్పాటు చేశారు. జిల్లాలోని 18 శాఖ గ్రంథాలయాల్లో మొత్తం 84,500 అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రంథాయాలల్లో జిల్లా వ్యాప్తంగా 1720 మంది మెంబర్‌ షిప్‌ తీసుకున్నారు.

2 కోట్లతో జిల్లా గ్రంథాలయం...

జిల్లా కేంద్రంలో అధునాతన భవనం రూ.2కోట్లతో అన్ని హంగులతో నిర్మాణం చేపడుతున్నారు. 2019 డిసెంబర్‌ 11 తేదీన శంకుస్థాపన చేశారు. కాగా, కరోనా నేపథ్యంలో నిధులు నిలిచిపోవడంతో సోమవారం తెలంగాణ రాష్ట్రం మొదటి విడుత కింద రూ.40 లక్షలను విడుదల చేస్తూ ప్రొసీడింగ్‌ కాపీని అందజేసింది. జిల్లా కేంద్రంలో హైదరాబాద్‌ సమీపంలో 0.15 గుంట(1800 గజాలు)లలో నిర్మాణం చేపడుతున్నారు. ఈ భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ఫ్లోర్‌ను నిర్మించనున్నారు. 

గ్రౌండ్‌ ఫ్లోర్‌లో....

భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన హాల్లో న్యూస్‌పేపర్‌ రీడింగ్‌ సెక్షన్‌(చదవడం), చైర్మన్‌ హాల్‌, సెక్రటరీ హాల్‌, ఆఫీస్‌హాల్‌, గ్రైడ్‌-1 ల్రైబరీ ఏర్పాటు చేస్తారు.

ఫస్ట్‌ఫ్లోర్‌లో...

ఫస్ట్‌ఫ్లోర్‌ పోవడానికి లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తారు. ఫస్ట్‌ఫ్లోర్‌లో రిపరెన్స్‌ సెక్షన్‌, టెక్ట్‌బుక్‌ సెక్షన్‌, ఇంటర్నెట్‌ సెక్షన్‌, రీడింగ్‌ హాల్‌, లెక్షరర్‌ సెక్షన్‌(సమావేశం), ఆడిటోరియం హాల్‌ను ఏర్పాటు చేస్తారు. జిల్లా గ్రంథాలయానికి ప్రతి రోజు చదవడానికి 70 నుంచి 100 మంది వరకు అన్ని రకాల ఎంట్రెన్స్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు, యువకులు, విద్యార్థులతోపాటు  వృద్ధులు పుస్తకాలను చదవడానికి వస్తారు. ఇందుకు వచ్చే వారి సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని అధునాతన భవన నిర్మాణం చేపట్టనున్నారు. 

త్వరలో పనులు ప్రారంభిస్తాం

గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించగా, మొదటి విడుతలో రూ.40 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించే విధంగా చూస్తా. ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపడకపోతే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేతోపాటు మరిన్ని నిధులు సమకూర్చి అధునాతన భవనం నిర్మించేందుకు కృషి చేస్తా. జిల్లాలోని యువతకు అవసరమగు ఎంట్రెస్‌ పరీక్షలకు సరపడా పుస్తకాలను అందుబాటులో ఉంచుతా.

- డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ 


VIDEOS

logo