సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jan 31, 2021 , 03:04:27

వైభవంగా నిత్యపూజలు

వైభవంగా నిత్యపూజలు

యాదాద్రి, జనవరి 30: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల సంద డి కొనసాగింది. స్వామివారిని దర్శించుకునే క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. యాదాద్రీశుడి బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీఅర్చనలు, నిత్యపూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు పంచనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి, హారతి నివేదనలను అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. స్వామివారి బాలాలయంలో నిత్యకల్యాణాన్ని నిర్వహించారు. కల్యాణం అనంతరం దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖమండపంలోనే ఊరేగించా రు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకుపైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖమండపంలో భక్తులకు అభిముఖం గా అధిష్ఠించి కల్యాణతంతును నిర్వహించారు. ఆలయంలో దర్శనం అనంతరం అష్టోత్తర పూజ లు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామివారికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద కొలువై ఉన్న క్షేత్ర పాలక ఆంజనేయస్వామివారికి జరిగిన పూజల్లోనూ భక్తులు పాల్గొన్నారు. వ్రత మండపంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

యాదాద్రీశుడి ఆదాయం రూ. 18,53,965 

యాదాద్రీశుడికి శనివారం రూ.18,53,956 ఆదాయం సమకూరిందని ఆలయ ఈ వో గీత తెలిపారు. ఇందులో ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ.1,90,788, రూ.100 దర్శనం తో రూ.35,100, వీఐపీ దర్శనంతో రూ.75,000, ప్రచారశాఖద్వారా రూ.405, క్యారీబ్యాగులతో రూ. 6,400, నిత్య కైంకర్యాలతో రూ. 2,400, సత్యనారాయణ వ్ర తాలతో రూ.99,500, కల్యాణకట్టతో రూ.23, 800, ప్రసాద విక్రయాలతో రూ.6,13,000, శాశ్వత పూజలతో రూ.77,928, వాహనపూజలతో రూ. 15,300, టోల్‌గేట్‌ ద్వారా రూ. 1,650, అన్నదాన విరాళంతో రూ.20,165, శివాలయం ఆదా యం రూ.816, సువర్ణపుష్పార్చనతో రూ.97, 516, యాదరుషి నిలయంతో రూ.73,370, పుష్కరిణితో రూ.750, పాతగుట్టతో రూ.21, 861, ఇతర విభాగాలతో రూ.4,97,016తో కలిపి స్వామివారికి రూ.18,53,965 ఆదా యం వచ్చిందన్నారు.

హుండీల లెక్కింపు

వలిగొండ, జనవరి 30: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో ఉన్న మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై శనివారం స్వామి వారి హుండీలను లెక్కించగా రూ.

13,63,510 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన కార్యనిర్వ హణాధికారి గుత్తా మనోహర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో భువనగిరి డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ సుమతి, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

తాజావార్తలు


logo