బుధవారం 03 మార్చి 2021
Yadadri - Jan 31, 2021 , 03:04:24

నేడే పల్స్‌పోలియో

నేడే పల్స్‌పోలియో

  • నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగింపు 
  • సర్వం సిద్ధం చేసిన అధికారులు 
  • జిల్లా వ్యాప్తంగా 69,066 మంది చిన్నారులు
  • 222 హైరిస్క్‌ ్ర పాంతాల గుర్తింపు
  • పర్యవేక్షణ చేపట్టనున్న వైద్యాధికారులు

భువనగిరి జనవరి 30: పోలియో మహమ్మారిని పూర్తి స్థాయిలో తరిమికొట్టేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 0-5 వయస్సు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంతో వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో  69,066 మంది 0-5 సంవత్సరాల పిల్లలను గుర్తించగా.. వారి కోసం 500 పోలియో కేంద్రాలు   ఏర్పాటు చేశా రు. ఇటుక బట్టీలు, భవన నిర్మాణ రంగాలు, ఊరు చివరలో గుడారాలు వేసుకొని జీవించే వలస కార్మికులు, కూలీలకు సంబంధించి 1380 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 500 కేంద్రాల్లో 200 మంది సిబ్బందితో చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు వేయనున్నారు. 

మూడు రోజుల పాటు కొనసాగింపు

జిల్లా వ్యాప్తంగా ఈనెల 31వ తేదీన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని అధికారులు లాంఛనంగా ప్రారంభించనున్నారు.  ఆదివారంతో పాటు ఫిబ్రవరి 1, 2వ తేదీల్లో సైతం పల్స్‌పోలియో చుక్కలు వేయనున్నారు. ఈక్రమంలో అందుకు అనుగుణంగా అన్ని ముందస్తు ఏర్పాట్లు సైతం చేపట్టారు. మొదటి రోజు 500 కేంద్రాల్లో, రెండో రోజు, మూడో రోజు  వైద్యసిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ పోలియో చుక్కలు వేయనున్నారు.

ప్రక్రియను పర్యవేక్షించనున్న వైద్యాధికారులు 

జిల్లాలో నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 20 మొబైల్‌ టీమ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఆటీమ్‌లను పర్యవేక్షించేందుకు ఆయా పీహెచ్‌సీల వైద్యాధికారులను నియమించారు. ఆయా పీహెచ్‌సీల పరిధిలోని సూపర్‌వైజర్లు రోజూ వ్యాక్సిన్‌ సరఫరాకు సంబంధించి సమగ్ర చర్యలు చేపడుతారు.

పల్స్‌పోలియోకు సమగ్ర చర్యలు 

ఈనెల 31న ప్రారంభం కానున్న పల్స్‌పోలియో కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేపట్టాం. అందుకు అనుగుణంగా అధికారులు, సిబ్బందిని సిద్ధం చేశాం. జిల్లా వ్యాప్తంగా 69,066 మంది చిన్నారులను గుర్తించాం ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేస్తాం. జనసంచారం కలిగిన ప్రాంతాలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు తదితర ప్రాంతాలను గుర్తించి 20 ప్రత్యేక కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తున్నాం. హైరిస్క్‌ ప్రాంతాల్లో సైతం పిల్లలకు వ్యాక్సిన్‌ వేయనున్నాం.         

- అద్దంకి పరిపూర్ణాచారి,జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి

VIDEOS

logo