గురువారం 04 మార్చి 2021
Yadadri - Jan 30, 2021 , 02:45:28

బస్వాపురం ప్రాజెక్టుతో సాగు నీరు

బస్వాపురం ప్రాజెక్టుతో సాగు నీరు

  • రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ మందుల సామేలు

మోత్కూరు, జనవరి 29: కొత్తగా నిర్మాణమవుతున్న బస్వాపురం ప్రాజెక్టు ద్వారా మోత్కూరు ప్రాంత రైతాంగానికి సాగు నీటి వసతి కల్పనకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ మందుల సామేలు తెలిపారు. శుక్రవారం మోత్కూరు గిడ్డంగు ల సంస్థ 2021 సంవత్సరం క్యాలెండర్‌ను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఏడు మండలాల పరిధిలోని వేల ఎకరాలకు సాగు నీరందించడానికి నిర్మించ తలపెట్టిన బునాదిగాని కాల్వకు బస్వాపురం ప్రాజెక్టుకు అనుసంధానం చేసేవిధంగా సీఎం కేసీఆర్‌, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపా రు. ఇటీవల వానకాలంలో బిక్కేరు వాగులో విడుదల చేసిన కాళేశ్వరం జలాలతో మోత్కూరు, అడ్డ గూడూరు మండలాల్లో 7,600 ఎకరాల సాగు విస్తీర్ణం వినియో గంలోకి వచ్చిందన్నారు. బస్వాపురం ప్రాజక్టు పనులు పూర్తిచేసి బునాదిగాని కాల్వకు నీటిని అనుసంధానం చేయడంతో మోత్కూరు, అడ్డగూగూరు, ఆత్మ కూరు(ఎం)మండలాల ప్రజలకు తాగు, సాగునీటి వసతి పు ష్కలంగా లభ్యమై ఈప్రాంతమంతా సస్యశ్యామలం అవు తుం దన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రకాశ్‌రాయు డు, ఉప్పలయ్య, చుక్క యాదగిరి, గొలుసుల యాదగిరి, అనీల్‌ తదిత రులు పాల్గొన్నారు.

క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి 

అడ్డగూడూరు : క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ మందుల సామేల్‌ అన్నారు. మండలంలోని డి.రేపాక గ్రామం లో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2014-15వ సంవత్సరం పూర్వ విద్యా ర్థులు నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా కబడ్డీ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభిం చారు. కార్యక్రమంలో వైస్‌ పురుషోత్తంరెడ్డి, సర్పంచ్‌ సుమలత, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మహేంద్రనాథ్‌, నాయకులు చలపతిరెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు.


VIDEOS

logo