ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 30, 2021 , 02:45:26

వైభవంగా అమ్మవారికి ఊంజల్‌సేవ

వైభవంగా అమ్మవారికి ఊంజల్‌సేవ

  • శ్రీవారికి ఘనంగా రోజువారి నిత్యారాధనలు, వ్రతాలు 
  • భారీగా పాల్గొని తరించిన మహిళా భక్తులు   

ఆలేరు, జనవరి 29: యాదాద్రిలక్ష్మీ నరసింహుడి బాలాల యంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్‌ సేవ కోలాహ లంగా నిర్వ హించారు. అమ్మవారికి జరిగే ఈ వేడుకల్లో   మహిళలు అధికంగా పాల్గొని తరించారు. బాలాలయం ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయం త్రం వరకు పలు దఫాలుగా భక్తులు సువర్ణ పుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి అర్చన జరిపారు. ముత్తయిదువు లు మం గళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంత రం అమ్మవారిని బాలాలయం ముఖ మంటపంలోని ఊ యలలో శయనింపు చేయించారు. గంటసేపు పాటలతో  కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది. 

ఘనంగా సుదర్శననారసింహ హోమం

 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో లక్ష్మీ నృసింహులను దివ్య మహోహరంగా ఆలకరించి సుదర్శన నారసింహహోమం వైభవంగా జరిపారు. అనంతరం స్వా మి అమ్మవార్ల నిత్యకల్యాణ పర్వాలను ఆగమశాస్త్ర రీతిలో చేపట్టారు. స్వామికి రోజువారి నిత్యారాధనలు ఆగమశాస్త్ర రీతిలో వైభవంగా జరిగాయి. వేకువజామున సుప్రభాతం తో ఆరంభించిన నిత్య విధి కైంకర్యాలు రాత్రి శయనోత్సవ వేడుకలతో ముగిశాయి. మండపంలో ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్పిం చారు. ఆలయంలో అష్టోత్తరం, సువర్ణాపుష్పార్చనలు కొన సాగాయి. కొండపై గల శివాలయంలో రామలింగేశ్వరుడికి ఉపాలయంలో చరమూర్తులకు నిత్యారాధనలు, వ్రత మం డపంలో సత్యనారాయణస్వామి వ్రతరాధనలు శైవ సంప్ర దాయరీతిలో కొనసాగాయి.

నిరాటంకంగా వ్రతాలు

 వారం రోజులుగా యాదాద్రి కొండ కింద తులసీవనం వద్ద గల శిల్పారామంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. యాదాద్రి లక్ష్మీ నరసిం హస్వామి పునర్నిర్మాణంలో భాగంగా కొండపై వ్రత మండ పాలలో నిర్వహించే సత్యనారాయణ వ్రతాలను కొండ కిం దకు మార్చారు. పరిస్థితిని గమనించి భక్తులు సత్యనారా యణ వ్రతమాచరించి కొండపైకి వెళ్లి స్వామి వారిని దర్శ నం చేసుకుని, మొక్కులు చెల్లించుకుంటున్నారు. 

ఖజానాకు రూ. 9,43,733 ఆదాయం

 శ్రీవారి ఖజానాకు శుక్రవారం రూ. 9,43,733 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బు కింగ్‌తో రూ. 81,670, రూ.100 దర్శనంతో రూ.37,00 0, ప్రచారశాఖ ద్వారా రూ.875, క్యారీ బ్యాగులతో రూ.5, 175, వ్రతాల ద్వారా రూ. 49,000, కల్యాణకట్టతో రూ. 13,920, ప్రసాద విక్రయయాల ద్వారా రూ. 4,04,130, శాశ్వత పూజల ద్వారా రూ. 12,000, వాహన పూజలతో రూ.12,200, టోల్‌గేట్‌ ద్వారా రూ. 1,160, అన్నదాన విరాళంతో రూ. 3,330, సువర్ణ పుష్పార్చనలతో రూ. 71, 796, యాదరుషి నిలయంతో రూ. 50,040, పుష్కరిణి ద్వారా రూ.500, పాతగుట్టలో రూ.13,335, ఇతర విభా గాలతో రూ. 1,84,002తో కలిపి శ్రీవారి ఖజానాకు  రూ.  9,43,733 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.

VIDEOS

logo