శనివారం 06 మార్చి 2021
Yadadri - Jan 29, 2021 , 00:08:31

'పుర'పాలనలో ఆలేరు అభివృద్ధి

'పుర'పాలనలో ఆలేరు అభివృద్ధి

స్వరాష్ట్రంలో మారిన రూపు రేఖలు

టీయూఎఫ్‌ఐడీసీ కింద రూ.20 కోట్లు మంజూరు 

పూర్తి కావచ్చిన అభివృద్ధి పనులు 

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

ఆలేరు టౌన్‌, జనవరి 28 : ఆలేరు పట్టణం.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉంటుంది. ఏండ్ల తరబడి సీమాంధ్ర పాలనలో అభివృద్ధికి నోచుకోలేదు. పాలకుల నిర్లక్ష్యమో.. ప్రజలు చేసుకున్న పాపమో తెలియదు కానీ అన్ని రంగాల్లో వెనుకబడింది. అయితే తెలంగాణ ఏర్పడ తర్వాత అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలేరు మున్సిపాలిటీ అయ్యాక రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆలేరు పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. మేజర్‌ గ్రామపంచాయతీగా ఉన్న ఆలేరు మున్సిపాలిటీగా మారింది. దీంతో టీయూఎఫ్‌ఐడీసీ కింద రూ.20కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పట్టణంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. రూ.6.2కోట్లతో రహదారికి ఇరువైపులా భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, రూ.2 కోట్లతో బైపాస్‌ రోడ్డును తారు రోడ్డుగా మార్చారు. రూ.1.2కోట్లతో రహదారి మధ్యన సెంట్రల్‌ లైటింగ్‌ పనులు, రూ.2కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, రూ.6 కోట్లతో ఆర్‌యూబీ నిర్మాణం తదితర పనులు చేపట్టారు. ఈ పనులన్నీ కొద్ది రోజుల్లో పూర్తికానున్నాయి. అయితే కరోనా కారణంగా పనులకు ఆటంకం కలిగింది. అంతే కాకుండా 14వ ఫైనాన్స్‌, పట్టణ ప్రగతి మ్యాచింగ్‌ గ్రాంట్‌ కింద మరో రూ.60లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో 12వార్డుల్లో  సీసీరోడ్లు, మురుగు కాల్వలు నిర్మిస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే పట్టణ రూపురేఖలు మారనున్నాయి. అలాగే డంపింగ్‌ యార్డు, వైకుంఠధామంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇటీవల జరిగిన మున్సిపల్‌ సమావేశంలో పెద్దమొత్తంలో నిధులు కేటాయించారు. దీంతో ఆలేరు పట్టణం కొత్తశోభ సంతరించుకోనున్నది. అలాగే సాయిబాబాగుడి నుంచి దుర్గమ్మ గుడి (సుమారు 2కి.మీ) వరకు రోడ్డు పునరుద్ధరణ పనుల కోసం ప్రభుత్వం రూ.3కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ పనులు పూర్తయితే ప్రయాణం సాఫీగా సాగనున్నది. దీంతో పాటుగా స్వచ్ఛ తెలంగాణ పేరిట ప్రభుత్వంలో రహదారుల పక్కన, ప్రధాన కూడళ్ల వద్ద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. దీంతో ఒంటికి, రెంటికి ఇబ్బందులు తప్పాయి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి 

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సహకారంతో ఆలేరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్ని నిధులైనా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారు. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. 

- వస్పరి శంకరయ్య, మున్సిపల్‌ చైర్మన్‌, ఆలేరు

మౌలిక వసతులకు ప్రాధాన్యం.. 

పట్టణంలో మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రతీ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నాం. ఆధునిక హంగులతో వార్డులను అభివృద్ధి చేస్తున్నాం. జరగలేదు. పట్టణాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ పెద్దమొత్తంలో నిధులను కేటాయిస్తున్నారు. 

      - బేతి రాములు,   కౌన్సిలర్‌, ఆలేరు 

గతంతో పోలిస్తే ఎంతో అభివృద్ధి 

గతంతో పోలిస్తే ఎంతో అభివృద్ధి జరుగుతున్నది. గతంలో మౌలిక వసతులు కొరవడి ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పాలకవర్గం, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు.

                 - పత్తి వెంకటేశ్‌, ఆలేరు

VIDEOS

logo