యాదాద్రి... తెలంగాణ తిరుపతి

సీఎం కేసీఆర్ సంకల్పంతోనే ఆలయ పునర్నిర్మాణం
మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్
ఆలేరు, జనవరి28: తెలంగాణ తిరుపతిగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం జరుగుతున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప సంక ల్పంతో యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టగా, ఆలయ పనులు దాదాపుగా 95 శాతం పూర్తయ్యాయని భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ అన్నారు. గురువారం ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వా మిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చ కులు ఆయనకు స్వామి వారి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. నూత నాలయాన్ని త్వరలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించా రని ఇందుకోసం పనుల్లో వేగం పెంచారని తెలిపారు. ఇప్పటికే రోజుకు 20 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారని, నూతనాలయం ప్రారంభం అనంతరం తిరుపతితో సమానంగా భక్తులు వచ్చే అవకాశం ఉం దన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకట య్య, టీఆర్ఎస్ నాయకుడు వెంకటేశ్‌గౌడ్ పాల్గొన్నారు.