శనివారం 06 మార్చి 2021
Yadadri - Jan 28, 2021 , 02:27:47

మున్సిపాలిటీ అభివృద్ధే ఏకైక లక్ష్యం

మున్సిపాలిటీ అభివృద్ధే ఏకైక లక్ష్యం

  • మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు 

చౌటుప్పల్‌, జనవరి 27: చౌటుప్పల్‌ మున్సిపాలిటీ అభివృద్ధే ఏకైక లక్ష్యని మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు అన్నారు. మున్సిపాలిటీ పాలకవర్గం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్‌ కార్యాలయంలో బుధవారం ఆయన కేక్‌కట్‌ చేసి పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు చైర్మన్‌కు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ  అభివృద్ధిలో రాజీపడేది లేదన్నారు. 20 వార్డులను సమగ్రంగా అభివృద్ధి చేస్తానన్నారు. రాజకీయాల కతీతంగా మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిషనర్‌ రాందుర్గారెడ్డి, వైస్‌ చైర్మన్‌ బత్తుల శ్రీశైలంగౌడ్‌, కౌన్సిలర్లు ఎండీ బాబాషరీఫ్‌, అంతటి విజయలక్ష్మీబాలరాజుగౌడ్‌, బత్తుల రాజ్యలక్ష్మీస్వామిగౌడ్‌, గోపగోని లక్ష్మణ్‌గౌడ్‌, దండ హిమబిందు అరుణ్‌కుమార్‌ , శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రేణుకుమార్‌,  నాయకులు బొడిగె బాలకృష్ణ, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 

VIDEOS

logo