ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jan 28, 2021 , 02:27:59

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించాలి

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించాలి

  • మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ తాండ్ర అమరావతి
  • పాల్గొన్న ప్రజా ప్రతినిధులు 

గుండాల, జనవరి 27: ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం తో పనిచేయాలని ఎంపీపీ తాండ్ర అమరావతి  అన్నా రు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం లో వివిధ శాఖల మీద సమీక్ష జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం సభ్యులు సకాలంలో హాజరు కాకపోవడంతో ఆలస్యంగా ప్రారం భమైంది. వైద్యశాఖ సమీక్షలో వైధ్యాధికారి డా. శ్రీనివా స్‌ కరోనా టీకా అపోహలపై స్పష్టంగా వివరించారు. గర్భిణులు, 18 ఏండ్ల లోపు వారు టీకా వేయించుకో వద్దని తెలిపారు. విద్యుత్‌శాఖపై జరిగిన సమీక్షలో గ్రా మాల్లోని ట్రాన్స్‌ఫారాల వద్ద ఏవీ స్విచ్‌లను ఏర్పాటు చేయాలని పెద్దపడిశాల సర్పంచ్‌మల్లేశ్‌ సభ దృష్టికి తీసు కువచ్చారు. సర్పంచ్‌ మాధవి మాట్లాడుతూ ట్రాన్స్‌ ఫారాల మరమ్మతు ఖర్చులను గ్రామపంచాయితీ నుం చి చేయాలని కింది స్ధాయి సిబ్బంది చెప్తున్నారని సభ దృష్టికి తీసుకురాగా అలాంటి ఖర్చులు విద్యుత్‌ శాఖ నుంచే ఖర్చు చేయాలని ఏఈ అనీల్‌ కుమార్‌ తెలిపా రు. అనంతరం ఎంపీపీ అమరావతి మాట్లాడుతూ ప్రజ లకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలని ఏఈ అనీల్‌కుమార్‌ను ఆదేశించారు. పంచాయితీరాజ్‌ ఇంజినీరింగ్‌ మరియు గ్రామీణాభివృద్ధిపై జరిగిన సమీ క్షలో ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలను గ్రామాల వారీగా యూనిట్లను ప్రకటించాలని సర్పంచ్‌ మల్లేశ్‌ సభ దృష్టికి తీసుకవచ్చారు. ఉద్యానవన శాఖపై జరిగిన సమీక్షలో ఉద్యానవన శాఖ అధికారి నసీమా మండల ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ప్రజలకు సంక్షేమ ప థకాలు ఎలా అందుతాయని సర్పంచ్‌ల ఫోరం మండ లాధ్యక్షుడు సైదులు సభ దృష్టికి తీసుకురాగా జడ్పీ కోఆ ప్షన్‌ సభ్యుడు ఖలీల్‌ ప్రజలకు అందుబాటులో ఉండాల ని ఉద్యానవన అధికారి నసీమాకు సూచించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖపై జరిగిన సమీక్షలో అంగన్‌వాడీ కేంద్రాల ముందు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సర్పం చ్‌లు బాషిరెడ్డి, మాధవి,అంబాల ఎంపీటీసీ  మహేశ్‌లు సభ దృష్టికి తీసుకురాగా సూపర్‌వైజర్‌ అండాలు మా ట్లాడుతూ ఎప్పటికప్పుడు అంగన్‌వాడీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే మాదృష్టికి తీసుకురావాలన్నారు. ఇంజినీరింగ్‌ విభాగం పై జరిగిన సమీక్షలో మేస్త్రీలు తదితర సమస్యల సాకు తో అభివృద్ధి పనులను ఆలస్యం చేయవద్దని ఎంపీపీ అమరావతి ఏఈ పూర్ణచందర్‌రావుకు సూచిం చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లక్ష్మీరాములు, వైస్‌ ఎంపీపీ మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో పుష్పలీల, తాసిల్దార్‌ దయా కర్‌రెడ్డి, పీఆర్‌డీఈ నరేందర్‌రెడ్డి, ఎంపీవో జనార్దన్‌రెడ్డి, ఏవో సంతోషి, ఆర్‌డబ్లూఎస్‌ ఏఈ అనూష, ఉపాధి హామీ ఈసీ వినోద్‌, ఐబీ ఏఈ నాగశ్రీ, పశు వైద్యాధికా రులు డా.గోపీకృష్ణ, డా.యాకుబ్‌, ఎంపీటీసీలు శ్రీశై లం, సుశీల, కవిత, అలివేలు, సర్పంచ్‌లు బాలకృష్ణ, విజితారెడ్డి, వరలక్ష్మి, గాయత్రి, హేమలత, భిక్షమయ్య, అబ్బులు, సంధ్య, భిక్షమమ్మ, డెన్నిస్‌ రెడ్డి, రేఖ తదిత రులు పాల్గొన్నారు.


VIDEOS

logo