సాహసమే శ్వాసగా..

- ఇక నుంచి అందుబాటులోకి జిప్‌లైన్, ఐ రోప్ కోర్సు
- విదేశాల నుంచి రాక్ ైక్లెంబింగ్‌కు ప్రత్యేక పరికరాలు
- శిక్షణా పరికరాలకు రూ.50 లక్షలకు పైగా ఖర్చు
- జిప్‌లైన్, ఐ రోప్ కోర్సుకు పూర్తయిన ట్రయల్స్
భువనగిరి అర్బన్, జనవరి 27 : తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ అనుమతులతో భువనగిరి ఖిల్లాపై రాక్ ైక్లెంబింగ్ శిక్షణను ఇప్పటికే నిర్వహిస్తున్నారు. ఈ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో మరో రెండు కోర్సులు జిప్‌లైన్, రోప్ కోర్సులపై శిక్షణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కోర్సులకు ఖిల్లాపై శిక్షణ ఇచ్చేందుకు అనుమతించింది. దీంతో గత వారం రోజుల నుంచి ఖిల్లాకు రోప్ అమర్చడం, రెండు వైపుల వైర్ బిగించడం వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కోర్సులకు ఉపయోగపడే రోప్, అల్యూమినియం వైర్‌తోపాటు అవసరమైన పరికరాలు సుమారు రూ.50 లక్షలతో యూరప్, ఇతర దేశాల నుంచి తెప్పించారు. వైరు బిగించడం, సిబ్బంది శిక్షణ, పర్యవేక్షణ కోసం కంట్రోలర్ కార్యాలయం, సామగ్రి, మొత్తం 12 నుంచి 15 మంది సిబ్బంది ఉండేలా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు గుజరాత్ రాష్ర్టానికి చెందిన శిక్షకుడు నీరత్భట్ పర్యవేక్షణలో జిప్‌లైన్ శిక్షణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖిల్లాపై ఇప్పటికే పలుసార్లు 500 ఫీట్ల నుంచి 180 ఫీట్ల వరకు జిప్‌లైన్ ట్రయల్ రన్ చేశారు. ఇప్పటికే రాక్ ైక్లెంబింగ్ చేసే స్థలానికి ఇరువైపుల వైరును బిగించారు. శిక్షణకు వచ్చిన వారు సేద తీర్చుకోవడం కోసం రాక్ ైక్లెంబింగ్ పాఠశాల సమీపంలో 200 గజాల స్థలంలో రోప్ కోర్సు పక్కన పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్కులో చిన్నారులకు, పెద్దలకు టికెట్ ధరలు పెట్టి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ తీసుకునే వారితోపాటు ఖిల్లాపైన ఉన్న కట్టడాలు సందర్శించేందుకు వచ్చే పర్యాటకులకు సైతం జిప్‌లైన్, రోప్ కోర్సుకు అవకాశం కల్పించాలని యోచిస్తున్నారు.
ఖిల్లాపై 8 వేల మందికి శిక్షణ పూర్తి...
భువనగిరి ఖిల్లాపై రాక్ ైక్లెంబింగ్ స్కూల్ ఆధ్వర్యంలో ఇప్పటికే 8 వేల మందికి పైగా శిక్షణ పొందారు. 2013 సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ శిక్షణ స్కూల్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారిలో పూర్ణ, ఆనంద్లతోపాటు 89 మంది ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు. దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని ఇప్పటికే 200 మంది అధిరోహించగా, తాజాగా జనవరి 21 భువనగిరి పట్టణానికి చెందిన పడమటి అన్వితారెడ్డి కూడా కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. అదేవిధంగా ఎల్బ్రోస్ పర్వతాన్ని 28 మంది, అంటార్కిటికాలోని విన్సల్ పర్వతాన్ని 9 మంది అధిరోహించిన వారు ఖిల్లాపై శిక్షణ పొందినవారే. భువనగిరి ఖిల్లా ఏకశిలగా ఇప్పటికే ప్రపంచ ఖ్యాతి పొందింది. పర్వతారోహణ చేసేందుకు అనుకూలంగా ఖిల్లా ఉండటంతో రాక్ ైక్లెంబింగ్, ర్యాప్లింగ్ కోసం ఇక్కడికి వివిధ దేశాలు, రాష్ర్టాల నుంచి శిక్షణ పొందడానికి వస్తుంటారు. శిక్షణలో భాగంగా మరో రెండు కొత్తగా జిప్‌లైన్, ఐరోప్ కోర్సులపై శిక్షణ ఇవ్వడంతో పర్వతారోహణకు మరింత దోహదపడుతాయి.
ఖిల్లాపై కొత్త కోర్సులు
జిప్‌లైన్ శిక్షణ..
ఖిల్లాపై రాక్ ైక్లెంబింగ్ స్కూల్ ఆధ్వర్యంలో జిప్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. జిప్‌లైన్ అంటే ఒక కొండ నుంచి మరో కొండకు చేరుకోవడానికి పూర్వంలో తాడు, వైరు సహాయంతో చేరుకునేవారు. ఇలా చేరుకోవాలంటే మొదటగా శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ శిక్షణనే జిప్‌లైన్ శిక్షణ అంటారు. ఈ శిక్షణలో ఖిల్లా కింద భాగంలోని కొండ నుంచి మరో వైపున్న ఖిల్లా భాగానికి అల్యూమినియం వైర్‌ను ఏర్పాటు చేశారు. ఒక కొండ నుంచి మరో కొండకు చేరుకోవడానికి వైరుకు పుల్లిని అమర్చారు. పుల్లిని చేతితో పట్టుకుని ఒక కొండ నుంచి మరో కొండకు చేరుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందుకు ఖిల్లా కింద భాగంలో వైరు ఒక చివరను బిగించి 450 ఫీట్ల నుంచి 500 ఫీట్ల దూరంలో ఉన్న ఖిల్లాకు వైరు రెండో చివరను బిగించారు. ఈ వైరుపై పుల్లి సహాయంతో ఒక చివర నుంచి మరో చివరకు చేరుకునే శిక్షణ పొందనున్నారు.
ఐరోప్ కోర్సు...
భువనగిరి ఖిల్లాపై శిక్షణ ఇస్తున్న కోర్సుల్లో ఐరోప్ కోర్స్ ఒకటి. వైరును పట్టుకుని వైరుపై నడవడమే ఈ ఐరోప్ కోర్స్. ఖిల్లా కింద భాగం నుంచి 80 ఫీట్ల ఎత్తు పైభాగంలో ఒక వైరు, కింది భాగంలో ఒక వైరును ఏర్పాటు చేశారు. పై భాగంలో ఉన్న వైరును పట్టుకుని కిందభాగంలో ఉన్న వైరుపై నడుచుకుంటూ వెళ్తారు. ఈ వైర్లను ఇప్పటికే ఏర్పాటు చేసి ట్రయల్ చేశారు. ఐరోప్ శిక్షణను చిన్నారులు, పెద్దలకు ఇవ్వనున్నారు.
కొత్త కోర్సులకు ఖిల్లాపై శిక్షణ...
భువనగిరి ఖిల్లాపై రాక్ైక్లెంబింగ్ శిక్షణ పొందిన వారు ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించారు. రాక్ ైక్లెంబింగ్ శిక్షణ సెంటర్ ఆధ్వర్యంలో మరో రెండు కొత్త శిక్షణలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఖిల్లాపై శిక్షణ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈక్రమంలో ఖిల్లాపై మరో రెండు కొత్త కోర్సులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణలు 1. జిప్‌లైన్ 2. ఐరోప్లైన్. ఈ కోర్సులకు శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే అంకర్ టెస్టింగ్(ట్రయల్‌ను) పూర్తి చేశారు. పర్యాటకశాఖ అధికారి ఈ కోర్సులపై పూర్తి పరిశీలన చేసిన తర్వాత వీటిపై సర్టిఫికెట్ ఇచ్చిన వెంటనే ఈ శిక్షణ కోర్సులను ప్రారంభించనున్నారు. కొత్త కోర్సులకు ఉపయోగించే పరికరాలు యూరప్ దేశం నుంచి రావడంలో లేటు కావడంతో శిక్షణ కోర్సులను ఈ నెల 31వ తేదీ లోపు ప్రారంభించనున్నారు.
నూతన కోర్సులకు ఏర్పాట్లు పూర్తి చేశాం
ఖిల్లాపై రాక్ ైక్లెంబింగ్, ర్యాప్లింగ్‌లో శిక్షణ పొందిన వారు అత్యంత ఎత్తైన ఎవరెస్టు పర్వతాలను అధిరోహించారు. పర్వతాధిరోహణకు ఖిల్లాపై శిక్షణ ఎంతో దోహదపడుతుంది. ప్రభుత్వం అనుమతించడంతో జిప్‌లైన్, ఐరోప్ కోర్సులను ప్రారంభించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ కోర్సులు పర్వతారోహణకు ఎంతో దోహదపడుతాయి.
- బి.శేఖర్‌బాబు, భువనగిరి రాక్ ైక్లెంబింగ్ శిక్షణ స్కూల్ నిర్వాహకుడు
శిక్షణ ఎంతో దోహదపడింది
కిలిమంజారో పర్వతాధిరోహణకు ఖిల్లాపై శిక్షణ పొందడంతో ఎంతో దోహదపడింది. ఖిల్లాపై శిక్షణ పొందే సమయంలో పర్వతారోహణ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలు ఇక్కడ నేర్చుకున్నా. ఖిల్లాపై శిక్షకులకు ఇచ్చే క్రమంలో ప్రతిరోజు కనీసం మూడుసార్లు ఖిల్లా పైభాగం నుంచి కింద భాగం వరకు ట్రేకింగ్ (నడవడం) చేశాను. ఖిల్లాపైకి వెళ్లి, కిందకు దిగుతున్న సమయంలో శ్వాస తీసుకోవడం, వదలడంలో పూర్తి అవగాహన పొందాను. అత్యంత ఎత్తుకెళ్తున్న కొద్దీ శ్వాస తీసుకోవడం కష్టం ఉన్నప్పుడు మనలో ఏ విధంగా మార్పు వస్తుంది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాల వంటి విషయాలపై ప్రతిరోజు ఇక్కడ నుంచే శిక్షణ పొందాను. దీంతో కిలిమంజారో పర్వాతాన్ని జనవరి 21న సుమారు 6 గంటల సమయంలోనే చేరుకున్నందుకు సంతోషంగా ఉన్నది.
- పడమటి అన్వితారెడ్డి, భువనగిరి, రాక్ ైక్లెంబింగ్ బోధకురాలు
తాజావార్తలు
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఘన సన్మానం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే
- దేశీయ విమానయానం ఇక చౌక.. ఎలాగంటే!
- పక్కాగా మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు
- బ్రాహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ కవిత
- 1.37 కోట్లు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
- మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయాభివృద్ధి