శనివారం 06 మార్చి 2021
Yadadri - Jan 27, 2021 , 02:42:26

రూ.10కోట్లతో అభివృద్ధి పనులు

రూ.10కోట్లతో అభివృద్ధి పనులు

చౌటుప్పల్‌, జనవరి 26 : తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాదికాలంలో రూ.10కోట్లతో చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు తెలిపారు. మంగళవారం ఆయ న మున్సిపల్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది రూ. 20కోట్లతో 20వార్డులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ కేంద్రంలో రూ.30కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. పెద్ద చెరువు నుంచి వరద కాలువ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని, నాగులకుంటను అభివృద్ధి చేస్తామని, రూ.2.50 కోట్లతో శ్మశాన వాటికల్లో అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. 

VIDEOS

logo