సోమవారం 08 మార్చి 2021
Yadadri - Jan 27, 2021 , 02:42:33

మువ్వన్నెల రెపరెపలు

మువ్వన్నెల రెపరెపలు

  • ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు

చౌటుప్పల్‌/భువనగిరి/చౌటుప్పల్‌రూరల్‌/అడ్డగూడూరు/ బీబీనగర్‌/భూదాన్‌పోచంపల్లి/వల్లిగొండ/రామన్నపేట/ మో త్కూరు, జనవరి26: గణతంత్ర దినోత్సవాన్ని చౌటుప్పల్‌, భువనగిరి మున్సిపాలిటీల పరిధిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయా లు, ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద, యువజన సంఘాలు, పార్టీల కార్యాలయాల ఎదుట జాతీయ జెండాలను ఎగుర వేసి వందనం చేశారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమర యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివా ళులర్పించారు. చౌటుప్పల్‌ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, సింగిల్‌విండో కార్యాలయం ఎదుట చైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి, ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆర్డీవో సూరజ్‌కుమార్‌,  ఏసీపీ కార్యాలయం ఎదుట ఏసీపీ సత్తయ్య, పీఎస్‌లో సీఐ శ్రీనివాస్‌, ప్రభుత్వ దవాఖానలో సూపరింటెండెంట్‌ జాతీయ జెండాలను ఎగురవేశారు. 

  • భువనగిరిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ శాఖ ల అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించి సెల్యూట్‌ చేశారు. ఆయా కార్యక్రమాల్లో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, కౌన్సిలర్‌లు, అధికారులు నాయకులు ఉన్నారు. 
  • చౌటుప్పల్‌ రూరల్‌ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట తహసీల్దార్‌ గిరిధర్‌, ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎంపీడీవో రాకేశ్‌రావు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. 
  • అడ్డగూడూరు తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రామకృష్ణ, పీహెచ్‌సీలో వైద్యాధికారి నరేశ్‌, పోలీస్‌స్టేషన్‌లో స్సై మహేశ్‌, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో అరుణకుమారి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అంజయ్య, సింగిల్‌విండో కార్యాలయం ఎదుట సింగిల్‌ విండో చైర్మన్‌ వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ఎదుట మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, పశువైద్యశాల కార్యాలయంలో పశువైద్యాధికారి అశోక్‌కుమార్‌ జాతీయ జెండాల ను ఎగురవేసి జాతీయగీతాన్ని ఆలపించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సిబ్బంది పాల్గొన్నారు.
  • బీబీనగర్‌ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌, ఎంపీడీవో శ్రీవాణి, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై రాఘవేందర్‌గౌడ్‌, పీఏసీఎస్‌ కార్యాలయంలో చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏవో పద్మ, పశువైద్యశాలలో వైద్యాధికారిణి ఉష, టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మండలాధ్యక్షుడు శ్రీనివాసులు జాతీయ జెండాల ను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో రైతుబం ధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ జైపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పింగళ్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ గణేశ్‌రెడ్డి, భాగ్యలక్ష్మి,  శ్రీనివాస్‌,  ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 
  • భూదాన్‌పోచంపల్లి మండలంలో జరిగిన జెండా విష్కరణల్లో ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ పుష్పల తామల్లారెడ్డి, వైస్‌ ఎంపీపీ వెంకటేశంయాదవ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ లింగస్వామి, తహసీల్దార్‌ దశరథనాయక్‌, ఎంపీడీవో బాలశంకర్‌, ఎస్సై సైదిరెడ్డి, టీఆర్‌ ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. 
  • వలిగొండ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో గీతారెడ్డి, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ నాగలక్ష్మి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై రాఘవేందర్‌గౌడ్‌, పీఏసీఎస్‌ కార్యాలయ ఆవరణలో చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయ ఆవరణలో చైర్‌పర్సన్‌ కవిత, వలిగొండ పంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్‌ లలిత, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ఎదుట మండల పార్టీ అధ్యక్షుడు పాండరి తది తరులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఆయా కార్య క్రమాల్లో ఎంపీపీ రమేశ్‌రాజ్‌, ఎంపీటీసీ రమేశ్‌, వైస్‌ ఎంపీపీ ఉమాబాలనర్సింహ, రత్నయ్య, మల్లారెడ్డి పాల్గొన్నారు.
  • రామన్నపేట మండలంలో జరిగిన రిపబ్లిక్‌ డే వేడుకల్లో జడ్జి ప్రమీలజైన్‌, ఎంపీపీ జ్యోతీబలరాం, తహసీల్దార్‌ ఇబ్ర హీం, ఎంపీడీవో జలేంధర్‌రెడ్డి,  సీఐ శ్రీనివాస్‌, డాక్టర్‌ విజ యలక్ష్మి, బెల్లియాదయ్య, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.
  • మోత్కూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట తహసీల్దార్‌ అహ్మద్‌, ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎంపీడీవో మనో హర్‌రెడ్డి, మున్సిపల్‌ కార్యాలయం వద్ద కమిషనర్‌ షేక్‌ మహమూద్‌, పీఎస్‌లో ఎస్సై ఉదయ్‌కిరణ్‌, మార్కెట్‌ కార్యా లయం వద్ద చైర్మన్‌ స్వాతి, రైతు సహకార సంఘం వద్ద చైర్మ న్‌ అశోక్‌రెడ్డి, వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద ఏవో స్వప్న, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం వద్ద మండలాధ్యక్షుడు రమేశ్‌ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఆయా కార్య క్రమాల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సావిత్రామేఘారెడ్డి, జడ్పీ టీసీ శారద, ఎంపీపీ సంధ్యారాణి, వైస్‌ఎంపీపీ లక్ష్మి, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ యాకుబ్‌ రెడ్డి, సోంమల్లు, మల్లేశ్‌ పాల్గొన్నారు.
  • భువనగిరి అర్బన్‌ : మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు ము న్సిపల్‌ కార్యాలయ ఆవరణలో జాతీయపతకాన్ని ఆవిష్కరిం చారు. భువనగిరి మున్సిపాలిటీ ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డును రిపబ్లిక్‌ డే వేడుకల్లో ప్రభుత్వ విప్‌ సునీతామహేం దర్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ సందీప్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ చేతుల మీదుగా మున్సిపల్‌ చైర్మన్‌ అందుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కిష్టయ్య, మున్సిపల్‌  కమిషనర్‌, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.  

VIDEOS

logo