ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 27, 2021 , 02:42:31

ధాన్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం

ధాన్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం

భువనగిరి జనవరి 26: ధాన్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని బ్రహ్మర్షి పత్రీజీ అన్నారు. ధానర్షి మెగా మురళీ రచించిన షిరిడీ సాయి చరితం, శ్రీసాయినాథ అష్టోత్తర వతనామావళి పుస్తకాలను మంగళవారం మండలంలోని గంగసానిపల్లి గ్రామ సమీపంలోని శాఖాహార గ్రామం ధ్యాన సాయిబాబా ఆలయంలో ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ  మల్లయ్య, సర్పంచ్‌ నగేశ్‌గౌడ్‌లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రతి మనిషి దైనందిన జీవితంలో ధ్యానాన్ని అలవర్చుకుని మానసిక ప్రశాంతతను పొందాలన్నారు. ధాన్యంతోనే సమస్యలకు పరిష్కారం దొరు కుతుందని సూచించారు. కార్యక్రమంలో ద్యాన సరస్వతి మెగా అనురాధ, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ మల్లయ్య, బీబీనగర్‌ టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌  తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo