శనివారం 06 మార్చి 2021
Yadadri - Jan 27, 2021 , 02:42:21

అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

  • కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ 
  • ఘనంగా గణతంత్ర దినోత్సవం 
  • కలెక్టరేట్‌లో అధికారిక వేడుకలు
  • జాతీయ పతాకం ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన కలెక్టర్‌    
  • హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు

అమరుల త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. 72వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని  కలెక్టరేట్‌లో మంగళవారం  ఆమె జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరు, సాధించిన ప్రగతిని వివరించారు. కరోనా కష్టకాలంలో ముందు వరుసలో ఉన్నవారితో పాటు బాధితులకు వెన్నంటి ఉండి ఆదుకున్న వారిని కలెక్టర్‌ అభినందించారు. భారత్‌ -చైనా సరిహద్దు గాల్వాన్‌ లోయలో వీరమరణం పొందిన తెలుగుతేజం కర్నల్‌ సంతోష్‌బాబుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మహావీరచక్ర పురస్కారం ఇవ్వడం గర్వకారణమన్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులకు  ప్రశంసాపత్రాలు అందజేశారు. వేడుకల్లో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

భువనగిరి, జనవరి 26: స్వాతంత్ర సంగ్రామంలో అమరుల త్యాగాల ఫలితంగా సిద్ధించుకున్న స్వాతంత్ర ఫలాలను ప్రతి భారతీయుడికీ చేరాలనే సంకల్పంతో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినట్లు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అభివర్ణించారు. 72వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని మంగళవారం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను కలెక్టర్‌ ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. కొవి డ్‌ నిబంధనల్లో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరు, సాధించిన ప్రగతి తదితర అంశాలను వివరించారు. కరోనా కష్ట కాలంలో ముందు వరుసలో ఉండి సేవలందించిన వారితో పాటు బాధితులకు వె న్నంటి ఉండి ఆదుకున్న వారందరిని కలెక్టర్‌ అభినందించారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో గాల్వన్‌లో యలో వీరమరణం పొందిన తెలుగు తేజం కర్నల్‌ సంతోష్‌బాబుకు ప్రభుత్వం మహావీరచక్ర పురస్కారం ప్రకటించడం ఎంతో గర్వకారణమన్నారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, వివిధ శాఖల సిబ్బందితోపాటు జిల్లాను అభివృద్ధి పథంలో ముందు కు తీసుకువెళ్లేందుకు అహర్నిశలు పాటుపడిన జిల్లాలోని 17 మండలాలకు చెందిన 17 ఉత్తమ గ్రామపంచాయతీలను ఎంపిక చేసి ఆయా గ్రామ సర్పంచ్‌లతో పాటు భువనగిరి మునిసిల్‌ చైర్మన్‌ ఆంజనేయులుకు కలెక్టర్‌ ప్రజాప్రతినిధులతో కలిసి ప్రశంసాపత్రాలు, సన్మాన కార్యక్రమాలను చేపట్టారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ మరిం త బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. 

 మినరల్‌ ఫండ్‌ నుంచి 3 అంబులెన్స్‌ల పంపిణీ..

 జిల్లా మినరల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నుంచి సమకూర్చిన 3 అంబులెన్స్‌ల ను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా యంత్రాంగానికి అప్పగించారు. ఒక్కో వాహనం రూ.12 లక్షలు ఉంటుందని, భువనగిరి, ఆలేరు, రామన్నపేట దవాఖానలకు ఒక్కొక్కటి చొప్పున కలెక్టర్‌ అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, కీమ్యానాయక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, డిప్యూటీ కలెక్టర్‌ సంతోషి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, కలెక్టర్‌ కార్యాలయ పరిపాలనాధికారి నాగేశ్వరాచారి, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

VIDEOS

logo