అభివృద్ధిపథంలో గ్రామాలు

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రామన్నపేట, జనవరి 25 : కేసీఆర్ ప్రభుత్వం గ్రామపంచాయతీలకు ప్రతినెలా నేరుగా నిధులను విడుదల చేస్తుండటంతో గ్రామాలు అభివృద్ధి పథంలో ముం దంజలో ఉన్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లిం గయ్య అన్నారు. సోమవారం మండలంలోని బాచుప్పల గ్రామంలో రూ. 20లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రైతులకు అనుకూలంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని, కేంద్ర ప్రభుత్వ చట్టాలతో సంబంధం లేకుండా రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని రూ.7500కోట్ల నష్టాన్ని భరించి ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. అలాగే రైతుబంధుకోసం ప్రతిఏటా రూ.12వేలకోట్లను ప్రభు త్వం మంజూరు చేస్తున్నదన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణవేణి ఎమ్మెల్యేను సన్మానించారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
గ్రామంలో సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన లక్షాయాభైవేల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే లింగయ్య రులకు సర్పంచ్ కృష్ణవేణీపురుషో త్తంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ జ్యోతీబలరాం, ఎంపీడీవో జలేంధర్‌రెడ్డి, ఎంపీటీసీ సతీశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు భిక్షంరెడ్డి, శ్రీనివాస్, ఆమేర్, నర్సింహ, శిల్ప, వార్డు సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఆర్థిక సాయం అందజేత
మండలంలోని పల్లివాడ గ్రామానికి చెందిన కల్లూరి మంగమ్మ ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెం దింది. సోమవారం ఎమ్మెల్యే లింగయ్య మంగమ్మ మృత దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 20వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సంధ్యస్వామి, జగన్మోహన్, రాములు ఉన్నారు.
తాజావార్తలు
- ఇలియానా బోల్డ్ కామెంట్స్.. షాక్‌లో నెటిజన్స్
- స్నేహితురాలికి వేధింపులు.. బీటెక్ విద్యార్థి అరెస్ట్
- పెండ్లి చెడగొట్టాలని ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులు
- చేపల విక్రయ వాహనాలనుత్వరగా అందజేయండి
- భద్రతలో భాగస్వామ్యం..
- 12 భాషల్లో రైల్వే హెల్ప్‌లైన్ సేవలు
- రోడ్డు భద్రతలో ఇక సామాన్యుడే ‘సేవియర్'
- మూడు డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు
- సమాజంలో స్త్రీల పాత్ర గొప్పది
- 160 మంది అతివలకు చేయూత