రిజిస్ట్రేషన్ల జోరు

- జిల్లాలో పుంజుకున్న రియల్ రంగం
- ఆరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సందడే సందడి
- 6,619 వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు
- 40 రోజుల్లోనే రూ.17.66 కోట్ల ఆదాయం
- క్రమక్రమంగా రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయంటున్న అధికారులు
యాదాద్రి భువనగిరి, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను గత యేడాది ఆగస్టు నుంచి నిలిపివేసింది. ధరణి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను జిల్లాలోని 17 తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు. వ్యవసాయేతర భూమల రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలోని భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, బీబీనగర్, రామన్నపేట, మోత్కూ రు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గత యేడాది డిసెంబర్ 14 నుంచి కార్డు (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్) విధానంలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఎల్ఆర్ఎస్ నిబంధనలను సైతం ఎత్తివేయడంతో ఇన్నాళ్లు పెండింగ్‌లో ఉన్న ప్లాట్లు, ఇండ్ల కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు తిరిగి ఊపందుకున్నాయి. క్రయ, విక్రయదారుల సందడితో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పూర్వకళ వచ్చింది.
6,619 రిజిస్ట్రేషన్లు.. రూ.17.66కోట్ల ఆదాయం
నాలుగు నెలల తర్వాత తిరిగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు మొదలవ్వగా.. 40 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో అత్యధికంగా 2,986 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా.. ఆదాయం పరంగా మాత్రం చౌటుప్పల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో రూ.7.64 కోట్లు రిజిస్ట్రేషన్ల రూపేనా వచ్చింది. అత్యల్పంగా మోత్కూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలో 232 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగగా.. ఆదాయం కూడా అతి తక్కువగా రూ.16.71లక్షలు వచ్చింది. రోజురోజుకూ రిజిస్ట్రేషన్లు పుంజుకుంటున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
- కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచేది లేదు : ఇఫ్కో
- ఇంటి రుణంపై రూ.4.8 లక్షల ఆదా.. ఎలాగంటే..!
- రియల్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీవో
- కొత్త కారు కొంటున్న జూనియర్ ఎన్టీఆర్.. ధరెంతో తెలుసా?
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ
- శివసేన నేతలతో ప్రాణ హాని : సుప్రీంకోర్టులో బాలీవుడ్ క్వీన్ పిటిషన్
- బరువు తగ్గాలా.. పచ్చి బఠానీ తినండి
- ఆ నగరంలో మాంసం.. గుడ్లు నిషేధం!..
- నేను ఐటెంగాళ్ ను కాదు: అనసూయ
- ప్రైవేటు రంగంలో స్థానిక రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం