మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Jan 24, 2021 , 00:31:58

జయహో..

జయహో..

  • సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం 
  • ఈడబ్ల్యూఎస్‌కు పదిశాతం రిజర్వేషన్‌ నిర్ణయంపై సర్వత్రా హర్షం 
  • సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం
  • జిల్లా అంతటా స్వచ్ఛందంగా  సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
  • పాల్గొన్న ప్రజా ప్రతినిధులు,ప్రజలు 

చౌటుప్పల్‌ జనవరి 23: సబ్బండ వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆ ర్‌ పెద్దపీట వేస్తున్నాడని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి తెలిపారు. స్థానిక మార్కెట్‌ యార్డులో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో శనివారం సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ అగ్ర వర్ణ  పేదలకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు సీఎం చర్యలు తీసుకోవడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మండలాధ్యక్షుడు మాధవరెడ్డి, నేతలు గోవర్ధన్‌రెడ్డి, చంద్రారెడ్డి, శం కర్‌రెడ్డి, సత్తిరెడ్డి, కరుణాకర్‌ రెడ్డి, పద్మారెడ్డి, శేఖర్‌ రెడ్డి, యాదిరెడ్డి, మహేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. 

విద్య, ఉద్యోగాల్లో అవకాశం దక్కుతుంది

భువనగిరి అర్బన్‌, జనవరి 23: రాష్ట్రంలోని అగ్ర కుల వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రిజర్వేషన్‌తో వారు సంబురాలు జరుపుకుంటున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అమరేందర్‌గౌడ్‌ అన్నారు. రాష్ట్రంలోని ఆర్థిక బలహీనులకు (ఈడబ్ల్యూఎస్‌) ప్రభుత్వ విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్‌ కల్పించాలనే నిర్ణ యాన్ని స్వాగతిస్తూ టీఆర్‌ఎస్‌ పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని వినాయక చౌరస్తాలో సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రిజర్వేషన్లతో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో అవకాశం దక్కుతుందన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అమరేందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు, ఎంపీపీ నిర్మల, పీఏసీఎస్‌ చైర్మన్‌ పరమేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కిష్టయ్య, టీఆర్‌ఎస్‌ మండ లాధ్యక్షుడు పాండు, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు రాజిరెడ్డి, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు మల్లయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, కౌన్సిలర్లు భగత్‌, కిరణ్‌కుమార్‌, ఏఎంసీ డైరక్టర్‌ కేశవరెడ్డి, బాలయ్య, వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.

సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

బీబీనగర్‌,జనవరి23: మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, కార్యదర్శి సుదర్శన్‌ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్‌ గౌడ్‌, జడ్పీటీసీ ప్రణీతా పింగళ్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ జైపాల్‌రెడ్డి, ఎస్‌ఎంసీ వైస్‌ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, పట్టణ సర్పంచ్‌ భాగ్యలక్ష్మి, మం డల కోఆప్షన్‌ సభ్యుడు అక్బర్‌, నాయకులు దేవేందర్‌రెడ్డి, మహేశ్‌గౌడ్‌, అశోక్‌, సత్యనారాయణగౌడ్‌, సంతోష్‌రెడ్డి, నగేశ్‌, శ్యామల, శేఖర్‌రెడ్డి, నరేందర్‌, గణేశ్‌, లింగేశ్‌  పాల్గొన్నారు.

రామన్నపేటలో..

రామన్నపేట, జనవరి23: రామన్నపేటలో మండలాధ్యక్షుడు భిక్షంరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, సర్పంచ్‌లు శీరిష, నర్సిరెడ్డి, లక్ష్మినర్సు, రేఖ, నేతలు శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మయ్య, శివనారయణ, ఇనాయతుల్లా బేగ్‌ పాల్గొన్నారు

భూదాన్‌పోచంపల్లిలో..

భూదాన్‌పోచంపల్లి, జనవరి 23: టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో పోచంపల్లి పట్టణం భువనగిరి చౌరస్తాలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మీ, వైస్‌ ఎంపీపీ వెంకటేశంయాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి, భువనగిరి మార్కెట్‌ క మిటీ డైరెక్టర్లు భిక్షపతి, మాధవరెడ్డి, చౌటుప్పల్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు మాదవి గౌడ్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, నేతలు మల్లారెడ్డి, కిరణ్‌, సీతవెంకటేశం, విశ్వనాథం, అంజమ్మ  పాల్గొన్నారు. 

రాజాపేట మండల కేంద్రంలో

రాజాపేట, జనవరి 23: రాజాపేట మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.కార్యక్రమంలో ఎంపీపీ బాలమణి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, నాయకులు శ్రీశైలం, సిద్ధులు, కరీం, భాస్కర్‌గౌడ్‌, సంతోశ్‌గౌడ్‌, సిద్దిరాములు, రాజు, భిక్షపతి, వీరేశం, రాజు, విశ్వనాథ్‌, సర్పంచ్‌ లు శ్రవన్‌కుమార్‌, షన్‌, ఉపసర్పంచ్‌ నర్సింహులు పాల్గొన్నారు.

VIDEOS

logo