ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jan 24, 2021 , 00:31:56

మహిళలు శక్తిమంతులు కావాలి

మహిళలు శక్తిమంతులు కావాలి

  • ‘సంఘమిత్ర’ కార్యక్రమంలో రాచకొండ షీటీమ్‌ అడిషనల్‌ డీసీపీ సలీమా
  • రాచకొండ పోలీసులు, సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నూతన కార్యక్రమం
  • భువనగిరిలో ప్రారంభించిన రాచకొండ షీ టీమ్‌ అదనపు డీసీపీ సలీమా 

మహిళలు శక్తిమంతులు కావాలని రాచకొండ షీటీమ్‌ అదనపు డీసీపీ సలీమా అన్నారు.  రాచకొండ పోలీస్‌, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్‌ మహిళా ఫోరం ఆధ్వర్యంలో మహిళలు, బాలికలపై జరిగే నేరాలపై పోరాడటంలో మహిళలను శక్తిమం తం చేయడానికి ‘సంఘమిత్ర’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం భువనగిరి పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఆర్‌కేఎస్‌సీ) భువనగిరి నుంచి సంఘమిత్ర కోసం గ్రామీణ రంగంలో మహిళల ఫోరం ఎంపికను ప్రారంభించారు. 

- భువనగిరి కలెక్టరేట్‌, జనవరి 23

భువనగిరి కలెక్టరేట్‌, జనవరి 23 : నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో మరింత శకిమంతులు కావాలని రాచకొండ షీ టీం అడిషనల్‌ డీసీపీ సలీమా అన్నారు. రాచకొండ పోలీస్‌, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్‌ మహిళా ఫోరం ఆధ్వర్యంలో మహిళలు, బాలికలపై జరిగే నేరాలపై పోరాడటానికి మహిళలను శక్తివంతం చేయడానికి ‘సంఘమిత్ర’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం భువనగిరి పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఆర్‌కేఎస్‌సీ) భువనగిరి నుంచి సంఘమిత్ర కోసం గ్రామీణ రంగంలో మహిళల ఫోరం ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ డీసీపీ సలీమా మాట్లాడుతూ.. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ ఆధ్వర్యంలో మహిళలకు భద్రత గురించి తెలియజేసి, వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపడానికి, సమాజంలో మహిళలను మరింత శకిమంతులుగా ఎదగటానికి సంఘమిత్ర కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం గ్రామీణ ప్రాంతాలు, సంఘాల నుంచి సమర్థవంతమైన వారిని గుర్తించి, వివిధ రకాలుగా ఇబ్బందులకు గురయ్యే మహిళా బాధితులకు సహాయాన్ని అందించటానికి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. సుమారు 30 మంది మహిళలు ఈ శిక్షణలో చేరినట్లు ఆమె తెలిపారు. అనంతరం పిల్లలతో సమాజాన్ని సురక్షితంగా, భద్రంగా ఉంచాలని చెబుతూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌, జిల్లా శిశు సంరక్షణ అధికారి పులుగుజ్జు సైదులు, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్‌ మహిళా వేదిక జాయింట్‌ సెక్రటరీ లతారామ్‌, సంఘమిత్ర కార్యక్రమం లీడ్‌ అధికారి మన్నె అర్చన, మహిళా ఫోరం సభ్యులు పాల్గొన్నారు.


VIDEOS

logo